Home /News /crime /

Nandita: కాలేజ్‌లో చదువుతున్న కూతురిని చూసి మురిసిపోయారు.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయారు..

Nandita: కాలేజ్‌లో చదువుతున్న కూతురిని చూసి మురిసిపోయారు.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయారు..

నందిత(ఫైల్ ఫొటో)

నందిత(ఫైల్ ఫొటో)

మోరిధార్ కాలేజ్‌లో నందిత సైకియా డిగ్రీ కోర్సు చదువుతోంది. ఆమె కాలేజ్‌ నుంచి తిరిగి వస్తున్న సమయంలో నాన్ టీచింగ్ సిబ్బంది రింటు శర్మ ఆమెపై దాడి చేశాడు.

  కాలేజ్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న ఓ విద్యార్థినిపై.. అదే కాలేజ్‌లో నాన్ టీచింగ్ సిబ్బందిగా ఉన్న వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. ఈ ఘటన అసోం‌లోని ధేమాజీ జిల్లా(Dhemaji district)లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గురువారం నిరసనలు చేపట్టారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. నందితను చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నందిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక, విద్యార్థిని హత్య చేసిన వ్యక్తి గతంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ అని కాలేజ్‌లోని విద్యార్థులు తెలిపారు. వివరాలు.. ఉత్తర అసోం ధేమాజీ జిల్లాలోని మోరిధార్ కాలేజ్‌లో నందిత సైకియా(Nandita Saikia) డిగ్రీ కోర్సు చదువుతోంది. నందితపై కాలేజ్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగి అయిన రింటు శర్మ శనివారం రోజు కత్తితో దాడి చేశాడు. నందిత శనివారం కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ దాడిలో నందిత తీవ్రంగా గాయపడింది. ఈ దాడిలో నందిత స్నేహితులలో ఒకరు, అలాగే స్నేహితురాలు తండ్రి కూడా గాయపడ్డారు.

  నందిత పరిస్థితి విషమంగా ఉండటంతో దిబ్రూగఢ్‌లోని(Dibrugarh) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నందిత బుధవారం సాయంత్రం మరణించింది. అయితే దాడి జరిగిన తర్వాత తీసిన ఒక వీడియోలో.. రింటు శర్మ చేతిలో కత్తితో కనిపించాడు. ‘ఆమె కోసం అన్ని చేసినప్పటికీ.. నా జీవితాన్ని నాశనం చేసింది’అని పేర్కొన్నాడు. ఈ ఘటన జరిగిన కొద్ది సమయంలోనే పోలీసులు నిందితుడు రింటు శర్మను అరెస్ట్ చేశారు. ఇక, రింటు శర్మ, నందితల మధ్య కొంత కాలం ఎఫైర్ ఉందని మోరిధల్ కాలేజ్ విద్యార్థులు తెలిపారు. అయితే నందితకు తెలిసిన కొన్ని కారణాల వల్ల అతడి నుంచి విడిపోవాలని భావించిందని చెప్పారు. ఈ క్రమంలోనే రింటు ఆమెపై కోపం పెంచుకున్నట్టుగా తెలుస్తోంది.

  Sad: ఎంత పని చేశావ్ తల్లి.. ‘అమ్మా.. నాన్న నన్ను క్షమించండి.. మీకు మొఖం చూపించలేను’అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకన్న యువతి..

  నందిత మరణ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి మరణ శిక్ష విధించాలని కోరుతున్నారు. నందిత మృతికి నిరసనగా అసోం వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీపీ సింగ్‌ను ఆదేశించింది. గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం నందిత మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.

  ‘నందిత సైకియాపై దారుణమైన దాడి, చికిత్స పొందుతూ ఆమె మరణించడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుబూతి. ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబ సభ్యులు నేను సంఘీభావం తెలియజేస్తున్నాను’అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అతుల్ బోరా(Atul Bora) ట్వీట్ చేశారు. నందితపై దాడి గురించి తెలుసుకుని షాక్ తిన్నట్టుగా రాజ్యసభ సభ్యుడు అజిత్ కుమార్ భూయాన్(Ajit Kumar Bhuyan) పేర్కొన్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

  Nirmal: ఏం పాపం చేసిందని ఆ చిన్నారి ప్రాణాలు తీశావు తల్లి.. నువ్వు అలా చేసినందుకు..

  నందిత మరణవార్త తన హృదయాన్ని కలచివేసిందని నటి ఐమీ బురవా(Aimee Baruah) తెలిపారు. నిందితునికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులకు, న్యాయవ్యవస్థకు ఆమె విజ్ఞప్తి చేశారు.

  ఈ ఘటనతో నందిత కుటుంబం షాక్‌లోకి వెళ్లిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమది పేద కుటుంబం అని, నందిత కళలను నిజం చేసేందుకు ఎంతో కష్టపడ్డామని వారు చెప్పారు. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని అంటున్నారు. కూతురి మృతితో వారు కన్నీటిపర్యంతమయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Assam, College student, Crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు