రేప్ కేసులో నిందితులు... బాధితురాలి తల్లి, సోదరిపై అరాచకం...

ఓవైపు నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష ఎప్పుడు వెయ్యాలో తేల్చుకోలేక... కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మరోవైపు రేపిస్టులు రెచ్చిపోతున్నారు. చట్టం అంటే భయమే ఉండట్లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఘటనే.

news18-telugu
Updated: January 18, 2020, 10:27 AM IST
రేప్ కేసులో నిందితులు... బాధితురాలి తల్లి, సోదరిపై అరాచకం...
రేప్ కేసులో నిందితులు... బాధితురాలి తల్లి, సోదరిపై అరాచకం...
  • Share this:
మొత్తం ఆరుగురు నిందితులు... ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంట్లో ఇద్దరు మహిళల్ని చితకబాదారు. వారిలో ఒకడు... ఓ మహిళ తలపై కాలుతో తన్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ బాధిత మహిళకు దాదాపు 40 ఏళ్లుంటాయి. ఆమె కూతురికి 2018లో 13 ఏళ్లు. ఆ ఏడాది ఆ బాలికను ఆరుగురు దుర్మార్గులు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఆ బాలిక చనిపోయింది. ఉత్తరప్రదేశ్... కాన్పూర్‌లో ఈ ఘోరం జరిగింది. ఆ కేసులో అరెస్టైన నిందితులు ఆరుగురికీ రెండు వారాల కిందటే బెయిల్ లభించింది. వెంటనే ఆ వెధవలు... బాధిత బాలిక ఇంటికి వెళ్లి... ఆమె తల్లిని, చిన్నమ్మను తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

కూతురి చావుకి కారణం వాళ్లే అంటూ... ఆమె తల్లి 2018లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాల కిందట వాళ్లకు బెయిల్ లభించింది. జనవరి 9న వాళ్లు... ఆమె ఇంటికి వెళ్లి... తల్లీ, ఆమె సోదరిని... రాళ్లు, కర్రలతో రక్తం కారేలా కొట్టారు. అదే రోజున వాళ్లపై మరోసారి కంప్లైంట్ నమోదైంది. దాడి చేసినప్పుడు వాళ్లంతా మద్యం తాగి ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కూతురిపై హత్యాచారం కేసులో తల్లీ, ఆమె సోదరే కీలక సాక్షులు. రేప్ కేసు విత్‌డ్రా చేసుకోమని బలవంత పెట్టిన నిందితులు... విత్ డ్రా చేసుకోకపోతే చంపేస్తామని బెదిరించారని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు