నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ.. మహిళల వద్ద లక్షలు వసూలు చేసిన మోసగాడు

కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్డౌన్ తో దేశవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది మళ్లీ ఉద్యోగాలు దొరక్క మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. అడ్డదారులు తొక్కుతూ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.

news18
Updated: November 25, 2020, 10:30 PM IST
నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ.. మహిళల వద్ద లక్షలు వసూలు చేసిన మోసగాడు
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 25, 2020, 10:30 PM IST
  • Share this:
కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్డౌన్ తో దేశవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది మళ్లీ ఉద్యోగాలు దొరక్క మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. గ్రామాల్లో ఉండే పలువురు స్థానికంగా దొరికే పనులు చేసుకుంటుంటే... పట్టణ యువకులకు మాత్రం ఏమీ పాలుపోవడం లేదు. దీంతో వాళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలాగే లాక్డౌన్ లో ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి.. మహిళల ఫోటోలను మార్ఫ్ చేసి.. వాటిని నగ్న చిత్రాలుగా మార్చి.. సోషల్ మీడియాలో పెడతానిని బెదిరించాడు. ఇలా బెదిరించి వారి దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశాడా మోసగాడు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు కింది విధంగా ఉన్నాయి.. ఢిల్లీకి చెందిన షోయబ్ అక్తర్ గతంలో ఒక సంస్థలో గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేసేవాడు. లాక్డౌన్ లో అందరిలాగే అతడు కూడా ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ఏం చేయాలో తెలియని షోయబ్ అక్తర్.. దాదాపు మూడు నెలల పాటు ఖాళీగానే గడిపాడు. చివరికి సోషల్ మీడియా వేదికగానే డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ కోసం అతడు మరో ఇద్దరి సాయం కూడా తీసుకున్నాడు.

ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే.. సోషల్ మీడియాలో పలువురు యువతుల ప్రొఫైల్ ఫోటోలను డౌన్లోడ్ చేసి.. వాటిని మార్ఫింగ్ చేయడం వారి పని. సదరు బాధితుల మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను వారికే పంపి.. తమకు డబ్బులివ్వకుంటే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించేవారు.

ఈ విషయం గురించి పోలీసులకు గానీ, ఇంట్లో వాళ్లకు గానీ చెబితే చంపేస్తామని హెచ్చరించడంతో చాలా మంది భయపడి.. ఎవరికీ చెప్పలేదు. ఇలా సుమారు 47 మంది మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసిన నిందితులు.. వారి దగ్గర్నుంచి సుమారు రూ. 12 లక్షలు వసూలు చేశారు. ఈ క్రమంలో నిందితుడి మోసానికి బలైన పలువురు యువతులు.. అక్తర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్తర్ కు సహకరించిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి వారిపై సంబంధిత కేసులను నమోదు చేశారు.
Published by: Srinivas Munigala
First published: November 25, 2020, 10:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading