హోమ్ /వార్తలు /క్రైమ్ /

Ostracised in death : తక్కువ కులం డాక్టర్ పోస్టుమార్టం చేశాడని..శవాన్ని వెలేసిన గ్రామం!

Ostracised in death : తక్కువ కులం డాక్టర్ పోస్టుమార్టం చేశాడని..శవాన్ని వెలేసిన గ్రామం!

బైక్ పై శవాన్ని తీసుకెళ్తున్న గ్రామ సర్పంచ్ భర్త

బైక్ పై శవాన్ని తీసుకెళ్తున్న గ్రామ సర్పంచ్ భర్త

Dead body in odisha : దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కులం తక్కువ వారంటూ మనుషుల్ని వెలేయడం జరుగుతున్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Dead body in odisha : దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కులం తక్కువ వారంటూ మనుషుల్ని వెలేయడం జరుగుతున్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దళితులు(Dalit) ముట్టుకున్నారని విలువైన వస్తువుల్ని సైతం పడేయడం, కాల్చేయడం లేదా సదరు వ్యక్తికి జరిమానా విధించడం,కొట్టి చంపడం వంటి ఘటనలు మనం నిత్యం వార్తల్లో చూస్తున్నాం. ఇప్పటికీ గ్రామాల్లో కొన్ని సామాజిక వర్గాలను వెలివేయడాన్ని చూడవచ్చు. ఏదో ఒక రూపంలో వారిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా ఒడిషా(Odisha) రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన మన సమాజంలో రుగ్మతలను మరోసారి వేలెత్తి చూపిస్తుంది.

అసలేం జరిగింది

ఒడిషా రాష్ట్రంలోని బర్గార్(Bargarh)జిల్లాలోని ఓ గ్రామంలో ముచ్చును సంద(Machunu Sandha)అనే వ్యక్తి దినసరి కూలీగా బతుకుబండిని నడిపేవాడు. అతడికి భార్య,మూడేళ్ల కూతురు ఉన్నారు. సంద భార్య ప్రస్తుతం గర్భవతి. దినసరి కూలీ అయిన సంద కొన్నాళ్లుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే గతవారం సంధ ఆరోగ్యం విషమించడంతో అతడిని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. అయితే ట్రీట్మెంట్ సమయంలోనే సంధ మృతిచెందారు. ఇక పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని శుక్రవారం అంబులెన్స్ లో స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే ఇంటికి తీసుకొచ్చిన మృతదేహాని చూడ్డానికి కూడా బంధువులు కానీ గ్రామస్థులు కానీ ఎవ్వరూ వెళ్లలేదు. సంధను తక్కువ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పోస్టుమార్టం చేశాడని తెలియడంతో అతని అంత్యక్రియలకు వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. బంధువులు, గ్రామస్థులు కనీసం మృతుడి భార్య గర్భంతో ఉందనే కనికరం కూడా చూపించలేదు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ భర్త అయిన సునీల్ బెహర ముందుకు వచ్చి అంత్యక్రియలకు సిద్ధమయ్యాడు. చాపలో శవాన్ని చుట్టి తన బైకు మీద స్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. అంతే కాదు సంధ మృతదేహాన్ని తీసుకువచ్చిన అంబులెన్సుకు చందాలు వసూలు చేసి చార్జీలు చెల్లించాడు.

Tourist Vehicle : లోయలో పడ్డ టూరిస్ట్ వాహనం ..ఏడుగురు మృతి,10మందికి తీవ్ర గాయాలు

గ్రామ సర్పంచ్ భర్త సునీల్ బెహర మాట్లాడుతూ..."పోస్టుమార్టంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శవపరీక్షలు చేసిన వారి అంత్యక్రియలకు వారు రాలేదు. కుటుంబంలో మగ సభ్యులు లేనందున, నేను నా బైక్‌పై మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లాల్సి వచ్చింది. మేము సుమారు రూ. 8,000 వసూలు చేసి అంబులెన్స్‌కి చెల్లించాం. మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లమని అంబులెన్స్ డ్రైవర్ ను కోరగా అతడు అందుకు అంగీకరించారు. అయితే రోడ్డు సరిగా లేకపోవడంతో అంబులెన్స్‌ను మధ్యలోనే ఆపేయడంతో సునీల్ మృతదేహాన్ని బైక్‌కు కట్టేసి అంబులెన్స్ డ్రైవర్, మరికొందరి సాయంతో స్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాం"అని తెలిపాడు

Published by:Venkaiah Naidu
First published:

Tags: Dead body, Odisha

ఉత్తమ కథలు