హోమ్ /వార్తలు /క్రైమ్ /

Organ Donation: అవయవదానంలో కూడా వీడని స్నేహం.. చనిపోయి కూడా 13 మందిని బతికించారు.. ఎక్కడంటే..

Organ Donation: అవయవదానంలో కూడా వీడని స్నేహం.. చనిపోయి కూడా 13 మందిని బతికించారు.. ఎక్కడంటే..

అవయదానం చేసిన స్నేహితులు (ఫైల్ ఫొటో)

అవయదానం చేసిన స్నేహితులు (ఫైల్ ఫొటో)

Organ Donation: వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. మనుషులుగా ఇద్దరైనప్పటికీ ఒకే వ్యక్తిగా జీవించారు. 12వ తరగతి వరకు కలిసే చదువుకున్నారు. ఇలా ఒకటిగా ఉన్న వారిని చావు కూడా వేరు చేయలేకపోయింది. అయితే చనిపోయి కూడా మరికొంతమంది బతికేందుకు అవకాశం కల్పించారు ఈ స్నేహితులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...

వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. మనుషులుగా ఇద్దరైనప్పటికీ ఒకే వ్యక్తిగా జీవించారు. 12వ తరగతి వరకు కలిసే చదువుకున్నారు. ఇలా ఒకటిగా ఉన్న వారిని చావు కూడా వేరు చేయలేకపోయింది. అయితే చనిపోయి కూడా మరికొంతమంది బతికేందుకు అవకాశం కల్పించారు ఈ స్నేహితులు. వారే మీట్ పాండ్య(18), క్రిష్ గాంధీ(19). గుజరాత్ (Gujarath) సూరత్‌కు చెందిన ఈ ఇద్దరు యువకులు ఆగస్టు 24న ప్రమాదానికి గురయ్యారు. బ్రెయిన్ డెడ్ కావడంతో వైద్యులు వీరి అవయవాలను 13 మందికి అమర్చారు. వివరాల్లోకి వెళ్తే.. మీట్ పాండ్య, క్రిష్ గాంధీ సూరత్(Surath) వాసులు. ఇటీవల బైక్‌పై వెళ్తుండగా.. నగరంలోని జీడీ గోయెంకా స్కూల్ సమీపంలో ఓ వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అయితే చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఇద్దరికీ బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు వైద్యులు. ఆగస్టు 28న ఈ విషయాన్ని నిపుణుల బృందం ధ్రువీకరించింది. దీంతో వారి తల్లిదండ్రుల అంగీకారంతో బాధితుల అవయవాలను దానం చేశారు. వీరిద్దరి అవయవాలను ఇతరులకు అమర్చామని తెలిపారు డొనేట్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నీలేష్ మాండ్లేవాలా. ఆయన మాట్లాడుతూ.. "బ్రెయిన్ డెడ్ (Brain Dead) అయిన ఇద్దరి గురించి సమాచారం అందిన వెంటనే ఆసుపత్రికి చేరుకున్నాం.

ఇది చదవండి: అక్టోబర్​ నుంచి అమల్లోకి నూతన వేతన కోడ్.. వారానికి 3 రోజుల సెలవు.. పనివేళల్లో భారీ మార్పులు..

వారి కుటుంబ సభ్యులను కలిశాం. ఈ విషాద సమయంలో కూడా మృతుల తల్లిదండ్రులు పేద రోగుల కోసం తమ బిడ్డల అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు" అని వివరించారు. ఇద్దరి కిడ్నీలు, కాలేయాలు, ఒకరి గుండె, రెండు ఊపిరితిత్తులు, నాలుగు కార్నియాలను వైద్యులు సేకరించారు. ఇద్దరి కిడ్నీలను అహ్మదాబాద్‌(Ahmedabad)లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అండ్ రిసెర్చ్ సెంటర్(ఐకేడీఆర్సీ)కి తీసుకెళ్లారు. కార్నియాలను సూరత్‌కు చెందిన ఐ బ్యాంక్‌కు దానం చేశారు. మీట్ పాండ్య కిడ్నీలను తన ఇద్దరి సోదరులకు అమర్చారు. క్రిష్ కిడ్నీలను మరో ఇద్దరికి మార్పిడి చేశారు.

ఇది చదవండి: ఈ స్కీమ్ వాళ్లకు మంచి పెట్టుబడి మార్గం.. పథకం అర్హత, ప్రయోజనాలు ఇవే..

గుండె, కాలేయం, కార్నియా, ఊపిరితిత్తులను సైతం అవసరమైన వారికి అమర్చినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. మీట్ పాండ్య, క్రిష్ గాంధీ చనిపోయిన తరువాత కూడా మొత్తం 13 మంది ప్రాణాలు కాపాడారని వారి సన్నిహితులు చెబుతున్నారు. మీట్ పాండ్య తండ్రి కల్పేశ్ రుస్తంపుర ప్రాంతంలో క్యాటరింగ్ వ్యాపారం చేస్తుండగా, క్రిష్ గాంధీ తండ్రి సంజయ్.. సూరత్‌లోని బేగంపురాలో స్నాక్స్ కార్డ్ నడుపుతున్నారు. ‘ఈ నష్టం ఎవరూ పూడ్చలేనిది.

వారి అవయవాలు వేరొకరిని బతికిస్తున్నాయంటే అంతే చాలు’ అని కల్పేశ్ పాండ్యా చెప్పారు. ‘క్రిష్‌ది చనిపోయే వయసు కాదు. కానీ ఈ నిజాన్ని జీర్ణించుకోవడానికి మాకు సమయం పడుతుంది. వారి అవయవాలు ఇతరులకు కొత్త జీవితాన్ని ఇవ్వగలవంటే.. అంతకంటే సంతోషం లేదనిపించింది. అందుకే అవయవ దానానికి ఒప్పుకున్నాం’ అని క్రిష్(Krish) తండ్రి సంజయ్(Sanjay) తెలిపారు.

First published:

Tags: Gujarat, Surat

ఉత్తమ కథలు