ONLINE SEX RACKET BUSTED IN VIJAYAWADA HERE IS SENSATIONAL TRUTHS BEHIND PRN
Vijayawada Sex Racket: విజయవాడలో సెక్స్ రాకెట్.., ఫారిన్ అమ్మాయిలతో వల..
ప్రతీకాత్మక చిత్రం
Vijayawada Sex Racket: విజయవాడలో హైటెక్ వ్యభిచారం వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల బీసెంట్ రోడ్డులో వెలుగు చూసి వ్యభిచారం ఘటన దర్యాప్తులో కొన్ని సంచలన నిజాలు బయటికొచ్చాయి.
వాట్సాప్ లో అందమైన యువతుల ఫోటోలు., అడ్వాన్స్ ఇస్తే హోటల్ కు అమ్మాయిలు.., కాస్త డబ్బు ఎక్కువ పెడితే ఫారిన్ అమ్మాయి. ఎవ్వరికీ డౌట్ రాకుండా టెక్నాలజీ సాయంతో చీకటి దందా. హోటల్ నిర్వాహకుల సపోర్ట్ తో మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం. ఇదీ విజయవాడ జరుగుతున్న ఆన్ లైన్ సెక్స్ రాకెట్ కహానీ. విజయవాడలో హైటెక్ వ్యభిచారం వేగంగా విస్తరిస్తోంది. టెక్నాలజీ సాయంతో గుట్టుగా చీకటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల బీసెంట్ రోడ్డులో వెలుగు చూసి వ్యభిచారం ఘటన దర్యాప్తులో కొన్ని సంచలన నిజాలు బయటికొచ్చాయి. కాలేజీ విద్యార్థినిలు, ఢిల్లీ, ముంబై, కోల్ కతా నగరాల నుంచి యువతులతో పాటు టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టులే కాకుండా రష్యా, ఇండోనేషియా, నేపాల్ కు చెందిన యువతులతో కూడా వ్యాపారం చేస్తున్నారు. ముబైల్ యాప్ లు, వెబ్ సైట్ల ద్వారా హోటల్ రూమ్స్, గెస్ట్ హౌస్ లను ముందే బుక్ చేసుకొని భార్యాభర్తల పేరుతో దర్జాగా వ్యాపారం నడిపిస్తున్నారు. ఇందుకు హోటల్ వ్యాపారులు కూడా సహకరిస్తున్నారు.
హోటళ్ల కోసం మాస్టర్ ప్లాన్
కాలేజీ విద్యార్ధుల పేరిట మొబైల్ యాప్స్ ద్వారా తమకు నచ్చిన హోటళ్లలో రూములను ముందుగానే బుక్ చేస్తున్నారు. తమ కాలేజీల్లో ఫెస్టివల్స్, మీటింగ్స్ ఉన్నాయని ఇతర ప్రాంతాల నుంచి అతిథిలు వస్తారని హోటల్ నిర్వాహకులను నమ్మిస్తున్నారు. అలా గెస్టుల ముసుగులో యువతీ, యువకులను హోటళ్లకు పంపి వ్యాపారం సాగిస్తున్నారు.
ఎవ్వరికీ అనుమానం రాకుండా..
సెక్స్ రాకెట్ ముఠాలు పక్కా స్కెచ్ తో వ్యవహరిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన అమ్మాయిలనను ఒకే చోట ఉంచకుండా వేర్వేరు ప్రాంతాల్లో హోటల్స్ బుక్ చేసుకోని అందులో ఉంచుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఫేక్ పేర్లు, అడ్రస్ లు ఇస్తున్నారు. అధిక డబ్బుకు ఆశపడి హోటళ్ల సిబ్బంది కూడా దీనికి సహకరిస్తున్నారు. అలా అమ్మాయిల వివరాలు విటులకు పంపి వారిని ఆకర్షిస్తున్నారు. ఆటోనగర్ కు చెందిన ఓ యువకుడు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
టెక్నాలజీ సాయంతో మాయ
వ్యక్తిగతంగా హోటళ్లు బుక్ చేసుకుంటే రిసెప్షన్ లో అడ్రస్ తో పాటు ఐడీ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మొబైల్ యాప్ లో అయితే ఆన్ లైన్లో వివరాలు ఎంటర్ చేసి హోటల్ నిర్వాహకులకు ఆ వివరాలతో కూడిన మెసేజ్ చూపిస్తే సరిపోతుంది. దీనినే వ్యభిచారల ముఠాలు క్యాష్ చేసుకొని చీకటి దందాను కొనసాగిస్తున్నాయి.