ONLINE SEX RACKET BUSTED IN DELHI AND 6 ARRESTED FROM MEWAT YOUNG PEOPLE TRAPPED BY GANG SRD
Delhi Sex Racket : సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు.. వీళ్ల ప్లాన్ చూస్తే షాక్ తినాల్సిందే..
ప్రతీకాత్మక చిత్రం
Delhi Sex Racket : దేశ రాజధానిలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు అయ్యింది. ఢిల్లీ కేంద్రంగా నడిపిస్తున్న ఈ సెక్స్ రాకెట్ లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయ్.
దేశ రాజధానిలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు అయ్యింది. ఢిల్లీ కేంద్రంగా నడిపిస్తున్న ఈ సెక్స్ రాకెట్ లో ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని మేవాడ్ జిల్లాలో వీరిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తో పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయ్. నిందితుల దగ్గర 10 సోషల్ మీడియా అకౌంట్లను రికవరీ చేశారు పోలీసులు. అలాగే, బాధితుల 40 వీడియోలను రికవరీ చేశారు. ఈ వీడియోల ద్వారా బాధితుల్ని బెదిరించి ఇప్పటి దాకా 25 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చీటింగ్ ఈ మధ్య మరోస్థాయికి వెళ్తోంది. అందమైన అమ్మాయిలతో వలపు బాణం వేస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు. అలాంటిదే ఈ ఢిల్లీకి సంబంధించిన సెక్స్ రాకెట్. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వెబ్ సైట్లలో ప్రకటనలిస్తూ ఒంటరిగా ఉన్న యువకుల్ని, యువతుల్ని ట్రాప్ చేస్తారు.
ఒంటరిగా ఉన్న యువతి, యువకులు వీరి టార్గెట్. ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించి ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో క్రమంగా యువతీ, యువకులతో మాటలు కలిపి.. ప్రేమిస్తున్నట్లు చెప్పి.. నగ్నంగా వీడియో కాల్ చేసేవారు. అలాగే ఆ వీడియో చూస్తున్న సమయంలో బాధితుల వీడియో వేరే వెబ్ సైబ్ ద్వారా రికార్డు చేసేవారు. వీడియో చాటింగ్ ముగిసిన తర్వాత అసలు సినిమా స్టార్ట్ అవుతోంది. న్యూడ్ వీడియో బంధువులు, ఫ్రెండ్స్ కు పంపిస్తానని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ అయ్యేది. ముందు చిన్న మొత్తంతో మొదలైన దోపీడి..చివరికి భారీ స్థాయిలోకి చేరుకునేది.
ఇలా వేధింపులు తట్టుకోలేకపోయిన ఓ బాధితుడు పోలీసులకు సమాచారమివ్వగా..ఈ గుట్టు రట్టైంది. కొందరు పరువు పోతుందని డబ్బులిస్తుండగా.., మరికొందరు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. బాధితుల్లో యువకులతో పాటు పెళ్లైనవారు, మధ్యవయస్కుల వారు కూడా ఉంటున్నారు. ఇలా బాధితుల్ని బెదిరించి 25 లక్షల రూపాయల వరకు దోచుకున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు నిందుతుల్ని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.