అవతలి వాళ్లేవ్వరో తెలియదు.. పక్కా ప్లానింగ్‌తో దోచేస్తారు..

అందుబాటులో ఉన్న సాంకేతికను చెడు పనులకు ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్‌ల విషయంలో సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నవారు ఎక్కువవుతున్నారు.

news18-telugu
Updated: September 26, 2020, 3:20 PM IST
అవతలి వాళ్లేవ్వరో తెలియదు.. పక్కా ప్లానింగ్‌తో దోచేస్తారు..
Online Rummy (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అందుబాటులో ఉన్న సాంకేతికను చెడు పనులకు ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్‌ల విషయంలో సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నవారు ఎక్కువవుతున్నారు. జనాలను ఆన్‌లైన్ ‌గేమ్‌లకు బానిసలుగా మార్చి.. వారి నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇందుకోసం కొత్త తరహా నేరాలకు శ్రీకారం చూడుతున్నారు. ఇందుకోసం పక్కగా సాఫ్ట్‌వేర్‌లు తయారుచేస్తున్నారు. మొదట జనాల్ని ఆకర్షించి.. ఆ తర్వాత కోలుకోలేని దెబ్బ తీస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. తొలుత అక్కడి నుంచి యువతను గేమ్‌ వైపు ఆకర్షిస్తారు. ఆ తర్వాత వారిని ఒక పద్ధతి ప్రకారం బురిడి కొట్టిస్తారు. ఇలా వారి ఆశను పెద్ద మొత్తంలో డబ్బు దండుకుంటారు. ఇందులో ఆన్‌లైన్ రమ్మీ బూతం చాలా వేగంగా విస్తరిస్తోంది.

ప్రతి రోజు ఒకరు ఇద్దరు కాదు.. దేశంలో కోట్లాది మందిని ఆన్‌లైన్‌ రమ్మీ భూతం కమ్మేస్తోంది. మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోని చిన్ని తెరలపై ఆడే ఈ 13 ముక్కల పేకాట వ్యసనం ఎందరో బతుకులను పల్టీ కొట్టిస్తోంది. అటువైపు ఆడుతోంది ఎవరో తెలియని ఈ జూదంలో.. ఇటువైపు ఆటగాళ్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. ఆన్‌లైన్‌ రమ్మీ మాయాజాలం అంటే అదే మరి.. స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేయగానే ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తాయి. "ఆన్‌లైన్‌ రమ్మీ ఆడండి... ఒక్క ఆటతో లక్షాధికారి కండి" అన్న రీతిలో ప్రకటనలు ఇస్తున్నారు. ఓసారి ఆడి చూద్దాం.. అని పలువురు ఆకర్షితులవుతున్నారు. ముందే బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

జనాలు ఇలా మోసపోతున్నారు..
మొదట కొన్ని ఆటలు గెలిచినట్టే ఉంటుంది. ఆ తర్వాత నుంచి వరుసగా ఓడిపోతుంటారు. అవతల ఎవరో వ్యక్తి ఇంత గెలిచారు.. అంత గెలిచారు.. అని స్క్రీన్‌ మీద చూపిస్తూ ఉంటుంది. దాంతో తామెందుకు గెలవలేం అని భావిస్తూ ఉన్న డబ్బులతోపాటు అప్పటికప్పుడు అప్పులు చేసి మరీ ఆడి కుదేలవుతున్నారు.
-ప్రత్యక్షంగా ఆడే రమ్మీ ఆటలో ఒకరు అవుట్‌ అయిపోతే మళ్లీ పందెం కాసి ఆటలో కలవచ్చు. అలా ఎవరు కలుస్తారో ఆడేవాళ్లకు తెలుస్తుంది. కానీ ఆన్‌లైన్‌ రమ్మీలో అక్కడే మతలబు ఉంటోంది. ప్రతి ఆటలో ఒకరో ఇద్దరో త్వరగా అవుట్‌ అయిపోయి మళ్లీ కలుస్తారు. అక్కడ ఎవరు కలుస్తారో తెలీదు. చివరికి ఆలా కలిసిన వారే ఆట గెలుస్తుంటారు.
-కొన్ని సార్లు ఒకరే ఒకటి కంటే ఎక్కువ ఆటల్లో ఒకేసారి కలిసి ఆడుతున్న ఉదంతాలు కూడా ఉన్నాయని కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-అసలు అటువైపు మనుషులే ఉండరని, కంప్యూటర్లే ఆడతాయని.. అంతా ఆన్‌లైన్‌లో మాయాజాలంతో బురిడీ కొటిస్తారని సైబర్‌ నిపుణులు చెబుతుండటం గమనార్హం.-తెలంగాణా,ఆంధ్రప్రదేశ్,అస్సాం, కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధించాయి. సిక్కిం, నాగాలాండ్‌ రాష్ట్రాలు ఆన్‌లైన్‌ రమ్మీకి అధికారికంగా అనుమతి ఇచ్చాయి. మిగిలిన రాష్ట్రాలు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు. అంటే ఆ రాష్ట్రాల్లో అనుమతి ఉన్నట్టుగానే పరిగణిస్తున్నారు.

లక్షల్లో గ్యాంబ్లింగ్ .. డబ్బు పోగొట్టుకుంటున్న ప్రజలు....
గేమ్ ఆఫ్ స్కిల్స్ పేరుతో ఆన్‌లైన్ రమ్మీకి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో దేశమంతటా ఆన్‌లైన్ రమ్మీ నిర్వహణ జోరుగా సాగుతోంది. ముంబై, బెంగళూరు తదితర కేంద్రాల నుంచి పెద్ద ఎత్తున ఆన్‌లైన్ రమ్మీ నిర్వహణ సంస్థలు తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఆన్‌లైన్ రమ్మీ వల్ల ఏటా వందల కోట్ల రూపాయలు గ్యాంబ్లింగ్ మాయలోపడి పోగొట్టుకుంటున్నారు. ప్రజలు. ముఖ్యంగా చిన్న పిల్లలు ,యువత వారికి తెలియకుండానే ఈ ఆన్‌లైన్ రమ్మీకి బానిసలవుతున్నారు . మొదట్లో ఆన్లైన్ రమ్మీలోకి దిగిన వారు ఆటల్లో గెలుస్తారు. దాంతో వారికి డబ్బు ఆశ చూపించి, ఆ తర్వాత క్రమంగా వారి డబ్బులు కొల్లగొట్టే కార్యక్రమం ఆన్‌లైన్ రమ్మి ద్వారా కొనసాగుతోంది.

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై ఆత్మహత్య
ఆన్‌లైన్ గేమ్స్ కు బానిసైన యువకులు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ కి బానిసలై, లక్షలలో లక్షలలో డబ్బులు పోగొట్టుకున్నారు. దీంతో అన్ని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టిన క్రమంలో తీవ్ర మానసిక వేధనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

తాజాగా పెద్దపల్లిలో వెలుగుచూసిన ఆన్‌లైన్ రమ్మీ కల్చర్..
పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆన్‌లైన్ రమ్మీ నిర్వహిస్తున్న స్థావరాన్ని పోలీసులు గుర్తించారు. డీసీపీ రవీందర్ నేతృత్వంలోని ఎస్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులోని విలాసవంతమైన గెస్ట్‌హౌస్‌‌పై దాడి చేసి పోలీసులు.. ఫేక్ జీపీఎస్ సాయంతో ఆన్‌లైన్ రమ్మి యాప్ వినియోగిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణకు రామగుండం కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఉత్తూరి శ్రీకాంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతనిపై గతంలో కూడా పలు కేసుల ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇంకా మిగిలిన నలుగురిలో.. తోటా సాయి తేజ, అందుగురి సందీప్, మహమ్మద్ హజ్రత్, గొల్లపల్లి అంజి ఉన్నారు. తెలంగాణలో ఆన్‌లైన్ రమ్మికి అనుమతి లేకపోవడంతో.. వీరు ఫేక్ జీపీఎస్ యాప్ ని ఉపయోగించి లొకేషన్ వేరే ప్రాంతంలో ఉన్నట్టు చూపించే విధంగా చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
Published by: Sumanth Kanukula
First published: September 26, 2020, 3:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading