ONLINE FRAUDS ORDERED SAMSUNG PHONE FOR DEAD CHEAP GOT BISCUIT RA
ఆన్ లైన్ లో ఫోన్ బుక్ చేశాడు... ప్యాకెట్ ఓపెన్ చేసి చూసి 'బిస్కెట్' అయ్యాడు...
ప్రతీకాత్మక చిత్రం
ఆన్లైన్ షాపింగ్ అంటేనే రోజురోజుకీ దిగజారిపోతోంది. ఒకటి బుక్ చేస్తే ఏవేవో వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లా జగదేవపూర్కి చెందిన యువకుడు మోసపోయాడు.
ఏం నాయనా తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కావాలా? అంటూ మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే.. సరేనంటూ డబ్బులు పంపొద్దు.. ఎందుకంటే.. ఈమధ్యకాలంలో ఇలాంటి కాల్స్‌తో డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకున్నారు సైబర్ నేరగాళ్లు.
ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లా జగదేవపూర్‌లో ఓ ఘటన జరిగింది. జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్‌కుమార్ అనే వ్యక్తి రూ.10వేల శాంసంగ్ ఫోన్ రాయితీపై తక్కువధరకు వస్తుందంటే నమ్మాడు. క్యాష్ ఆన్ డెలీవరీ ఆప్షన్ ఎంచుకున్నాడు.
అనుకున్నట్టుగానే ఇరవైరోజుల తర్వాత పార్సల్ వచ్చింది.. అందుకున్న లక్ష్మణ్ ఆనందంతో రూ.1,785 డబ్బులిచ్చి ప్యాకెట్‌ని ఓపెన్ చేశాడు. ప్యాకెట్లో చూసేసరికి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అందులో ఫోన్ లేదు.. అంతేనా బిస్కెట్స్, ప్లాస్టిక్ బొమ్మలున్నాయి. అప్పటివరకూ అతనితో మాట్లాడినవారికి తిరిగి ఫోన్ చేస్తే.. తప్పు తమది కాదని.. తాము ఫొనే పంపించామని.. మధ్యలో ఏం జరిగిందో తెలియదనే సమాధానం ఎదురైంది.
ఇంకేముంది.. అంతా అయిపోయాక ఆశ్చర్యపోవడం లక్ష్మణ్ వంతైంది. కాబట్టి.. మీరూ ఆన్లైన్ షాపింగ్ చేసేముందు కాస్తా ఆలోచించుకోండి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.