Hyderabad: కొడుక్కు ఫోన్ ను ఇచ్చిన తండ్రికి మరుసటి రోజే ఊహించని షాక్.. నిలదీస్తే బయటపడ్డ బండారం.. అసలేం జరిగిందంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ఏప్రిల్ 12వ తారీఖున తన మొబైల్ ను ఓ తండ్రి తన కొడుక్కు ఇచ్చాడు. అతడు ఆ ఫోన్లో యూట్యూబ్లో వీడియోలు చూసుకున్నాడు. సాయంత్రం పూట తిరిగి ఇచ్చేశాడు.మరుసటి రోజే ఆ తండ్రికి ఊహించని షాక్ తగిలింది..

  • Share this:
    ఓ వ్యక్తి తన కుమారుడికి మొబైల్ ను ఇచ్చాడు. కొద్ది గంటల పాటు తన వద్దే ఆ ఫోన్ ను ఉంచుకున్నాడు. యూట్యూబ్ లో వీడియోలు చూడటం, సినిమాలు చూడటం చేశాడు. ఆ తర్వాత తండ్రికి మొబైల్ ఇచ్చేశాడు. మరుసటి రోజే ఆ తండ్రికి షాకింగ్ నిజం తెలిసింది. తన బ్యాంకు ఖాతాలోంచి 50 వేల రూపాయలకు పైగానే డబ్బులు మాయమయ్యాయని తెలిసింది. తన మొబైల్ లో ఉన్న ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ ను చెక్ చేశాడు. ఓ గుర్తు తెలియని నెంబర్ కు డబ్బులు తన ఖాతా నుంచే ఎవరో పంపారని తెలిసింది. ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. ఈ నెంబర్ ఎవరిది? ఎవరు డబ్బులు పంపారు? అని కుటుంబ సభ్యులను నిలదీశాడు. అప్పుడు అతడి కుమారుడు అసలు నిజం చెప్పాడు. జరిగిందేంటో పూసగుచ్చినట్టు వివరించాడు. హైదరాబాద్ లో జరిగిన కొత్త తరహా మోసం గురించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    హైదరాబాద్ లోని పంజాగుట్ట కుమ్మరబస్తీకి చెందిన జీ.గోపాల్ రెడ్డి అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి కుమ్మరబస్తీలోనే నివాసం ఉంటున్నాడు. ఏప్రిల్ 12వ తారీఖున తన మొబైల్ ను కుమారుడు గుణశేఖర్ కు ఇచ్చాడు. గుణశేఖర్ ఆ ఫోన్లో యూట్యూబ్లో వీడియోలు చూసుకున్నాడు. సినిమాలు చూశాడు. కొన్ని గంటల పాటు ఆ ఫోన్ ను తన వద్దే ఉంచుకుని సాయంత్రం పూట తండ్రికి తిరిగి ఇచ్చేశాడు. 13వ తారీఖున అతడి ఖాతా నుంచి 50,100 రూపాయలు డబ్బులు మాయమయ్యాయని గుర్తించాడు. తన ఖాతాలోంచే ఓ గుర్తు తెలియని నెంబర్ ఫోన్ పే ద్వారా డబ్బులు పంపినట్టు గుర్తించాడు. ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. విషయం ఏంటనీ? ఎవరు పంపారని కుటుంబ సభ్యులను నిలదీస్తే గుణశేఖర్ నిజం వెల్లడించాడు.
    ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

    ’నిన్న మీరు నాకు ఫోన్ ఇచ్చినప్పుడు రెండు మెసేజ్ లు వచ్చాయి. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాంకు సంబంధించిన లాటరీని గెలుచుకున్నారని ఆ నెంబర్ల నుంచి రెండు మెసేజ్ లు వచ్చాయి. నేను వాళ్లకు ఫోన్ చేశాను. వాళ్లు రిజిస్ట్రేషన్ చార్జీలనీ, ఇతర కారణాలు చెప్పారు. 16వేలు ఒకసారి, 25వేలు ఒకసారి, 9100 రూపాయలు మరోసారి డబ్బులు పంపాను. ఇంకా అడిగారు కానీ, మేం పేదోళ్లం సార్, మా దగ్గర ఉండవని చెప్పా. సరేనని రెండ్రోజుల్లో లాటరీ డబ్బు అకౌంట్లో పడుతుందని చెప్పి ఫోన్ పెట్టేశారు‘ అని గుణశేఖర్ చెప్పుకొచ్చాడు. జరిగిందేంటో గ్రహించిన గోపాల్ రెడ్డి కొడుకు మోసపోయాడని తేల్చేశాడు. ఈ విషయమై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    ఇది కూడా చదవండి: ఓ ఇంటి ముందు టెంటు వేసి.. కుర్చీలో కూర్చుని కూలింగ్ వాటర్ తాగుతూ నిరసన.. ఇంతకీ అసలేం జరిగిందో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!
    Published by:Hasaan Kandula
    First published: