భర్త వదిలేశాడంటూ ఆన్‌లైన్‌లో అడుక్కున్న భార్య... ఎంత సంపాదించిందో తెలుసా?

ఇదంతా తెలుసుకున్న అక్కడి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే సౌదీలో బిక్షటాన చేయడం నిషేధం.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: June 11, 2019, 10:19 AM IST
భర్త వదిలేశాడంటూ ఆన్‌లైన్‌లో అడుక్కున్న భార్య... ఎంత సంపాదించిందో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
Sulthana Begum Shaik | news18-telugu
Updated: June 11, 2019, 10:19 AM IST
భర్త చనిపోయాడు. పిల్లలున్నారు. ఎలా బతకాలో తెలియడం లేదు. పిల్లల్ని పెంచడం భారంగా ఉందంటూ... ఓ మహిళా బిక్షాటన చేసింది. ఆన్‌లైన్లో జనాలను వేడుకొంది. ఆమె అలా అడుక్కుంటూ బొట బొట కన్నీరుకార్చగానే.. చాలామంది కరిగిపోయారు. ఆమెను ఓదార్చుతో పెద్దమొత్తంలో చాలామంది దయామయులు డబ్బులు కూడా సాయం చేశారు. ఇలా ఆమె కేవలం 17 రోజుల్లోనే ఒకటి రెండు కాదు... దాదాపు 50వేల డాలర్లు సంపాదించింది. అయితే ఆ తర్వాతే అసలు నిజం బయటపడింది. ఆమె అలా అందర్నీ మోసం చేసిందని. ఈ ఘటన సౌదీలో చోటుచేసుకుంది.

దుబాయ్‌లో ఓ మహిళ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్లు క్రియేట్ చేసింది. తనను భర్త వదిలేసిన బాధితురాలిగా పరిచయం చేసుకుంది. పిల్లలను పెంచుకునేందుకు ఆర్థికంగా సాయం చేయాలని వేడుకుంది. ఆమె మాటలు నమ్మిన కొందరు నెటిజన్లు అమాయకంగా దాదాపు 50వేల డాలర్లు అంటే.. సౌదీ కరెన్సీలో లక్షా 83వేల 500 దిరహమ్స్‌ను ఆమెకు డోనెట్ చేశారు. అయితే ఇదంతా తెలుసుకున్న అక్కడి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే సౌదీలో బిక్షటాన చేయడం నిషేధం. అది ఆన్ లైన్‌లో అయినా సరే కూడా... ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వెంటనే అక్కడ చట్టాలు ప్రకారం చర్యలు తీసుకుంటారు.

దీంతో బిక్షాటన చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇలాంటివి నమ్మకూడదని నెటిజన్లకు సూచించారు. మరోవైపు నిందితురాలి భర్త కూడా ఈ ఘటనపై స్పందించాడు. భార్యను వదిలేసిన మాట వాస్తవమే కానీ.. పిల్లలు తనతో పాటే ఉంటున్నారని తెలిపాడు. సౌదీ చట్టాలు ప్రకారం సోషల్ మీడియాలో కూడా ఎవరైనా సరే భిక్షాటన చేస్తే 2,50,000 నుంచి 50,000 దిరహమ్స్‌ వరకు జరిమానాగా విధిస్తారు.

First published: June 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...