ఇది విన్నారా... లక్ష రూపాయల ఉల్లిపాయలు చోరీ...

Maharashtra : ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లో ఉల్లిని చోరీ చెయ్యడానికి కూడా వెనకాడట్లేదు దొంగలు. ఏకంగా రూ.లక్ష ఉల్లి పోవడంతో... ఆ రైతు లబోదిబో మంటున్నాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 24, 2019, 2:53 PM IST
ఇది విన్నారా... లక్ష రూపాయల ఉల్లిపాయలు చోరీ...
లక్ష రూపాయల ఉల్లిపాయలు చోరీ... (File)
  • Share this:
Onions Theft : ఉల్లిపాయల్ని కోస్తే కన్నీరు రావడం కామన్. కానీ ఆ రైతుకి కొయ్యకుండానే కన్నీరు తెప్పిస్తున్నాయి. ధరలు ఆకాశాన్ని అంటిన సమయంలో... ఉల్లి రైతులు పండగ చేసుకోవాలి. మరి అతనెందుకు ఏడుస్తున్నాడంటే... కారణం అతని ఇంట్లో నిల్వ చేసిన రూ.1 లక్ష విలువైన ఉల్లిపాయల్ని ఎవరో చోరీ చెయ్యడమే. మహారాష్ట్రలోని ఉల్లిపాయల ఎగుమతికి కేంద్రమైన నాశిక్ జిల్లాలో జరిగిందీ ఘటన. అక్కడ ప్రమాదకరంగా తయారైన దొంగలు... రకరకాల చోరీలు చేస్తూ భయపెడుతున్నారు. తాజాగా వాళ్ల కళ్లు ఉల్లిపై పడ్డాయి. కల్వాన్ ఊరిలో రైతు రాహుల్ బాజీరావ్... తన ఇంటినే స్టోర్ రూమ్‌గా మార్చుకొని ఉల్లిపాయల్ని జాగ్రత్తగా దాచుకున్నాడు. రోజూలాగే ఇంట్లో వాళ్లంతా ఆదివారం పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచివున్నాయి. గుండె జారిపోయింది. వెంటనే లోపలికి వెళ్లి చూస్తే... ఒక్క ఉల్లిపాయా లేదు. ఉల్లి బస్తాలన్నీ ఎత్తుకుపోయారు. ప్రస్తుత ధర ప్రకారం వాటి విలువ రూ.1లక్ష దాకా ఉంటుందని ఆ రైతు ఏడుస్తూ పోలీసులకు చెబుతున్నాడు.

కేసు రాసిన పోలీసులు... ఆ కేటుగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే... ఈ పాటికే వాళ్లు ఆ ఉల్లిని అమ్మేసి ఉంటారని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉల్లికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఢిల్లీలో కేజీ రూ.70 నుంచీ రూ.80 దాకా పలుకుతున్నాయి. అందువల్లే దొంగలు... ఏ నగలో, డబ్బులో ఎత్తుకుపోకుండా... ఉల్లిపాయల్ని పట్టుకుపోయారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు... స్థానిక మార్కెట్లలో ఉల్లి సంచులను పరిశీలిస్తున్నారు. ఐతే... ఆ మార్కెట్లలో ఉల్లి సంచులన్నీ ఒకేలా ఉన్నాయి. అన్నీ గోనె సంచులే. అందువల్ల బాజీరావ్ ఉల్లిపాయల సంచులు ఏవో కనిపెట్టడం కష్టమవుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని హోల్‌సేల్ మార్కెట్‌లో కేజీ ఉల్లి రూ.57 పలుకుతోంది. రిటైల్ మార్కెట్‌లో రూ.80 దాకా ఉంది. ఏది ఏమైనా... ఇలా ఉల్లిపాయల చోరీ జరగడం కలకలం రేపుతోంది.

 ఇవి కూడా చదవండి :

Health Tips : డయాబెటిస్‌కి వేపతో చెక్... ఇలా చెయ్యండి

బ్రిటన్ టూరిస్టులకు షాక్ ఇచ్చిన థామస్ కుక్... మెక్సికోలో నిలిచిన ఫ్లైట్ సర్వీసులు

Health Tips : డయాబెటిస్ ఉందా... మీరు తినదగ్గ 10 బేక్‌ఫాస్ట్స్ తెలుసుకోండి


Health Tips : కొబ్బరి పాలతో హెయిర్ స్పా... ఇలా చెయ్యండి

Peanut Butter Fruit : ఈ ఫ్రూట్ విశేషాలు తెలుసా మీకు?

 
First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు