ఒంగోలులో దారుణం... రోడ్డుపై వివస్త్రగా మహిళ గ్యాంగ్‌రేప్‌పై అనుమానాలు

ఘటనాస్థలంలో బాధితురాలు పక్కన మహిళల లోదుస్తులు, కండోమ్స్, నల్లపూసల దండ పడివుండటాన్నిపోలీసులు గుర్తించారు.

news18-telugu
Updated: January 22, 2020, 1:02 PM IST
ఒంగోలులో దారుణం... రోడ్డుపై వివస్త్రగా మహిళ గ్యాంగ్‌రేప్‌పై అనుమానాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రకాశం జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంగోలు శివారుల్లో గ్యాంగ్ రేప్ జరిగిందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేశవరాజు కుంట శివారులో ఓ మహిళ అపస్మారక స్థితిలో వివస్త్రగా పడివుంది. దీంతో ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్పృహలేకుండా పడి ఉన్న బాధితురాల్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో బాధితురాలు పక్కన మహిళల లోదుస్తులు, కండోమ్స్, నల్లపూసల దండ పడివుండటాన్ని గుర్తించారు. మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు మహిళ ఒంటిపై గాయాలు కూడా ఉండటంతో మహిళ ఎవరో ఆమెపై అత్యాచారం చేసి వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె స్పృహలోకి వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Published by: Sulthana Begum Shaik
First published: January 22, 2020, 1:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading