ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. ఒంగోలు పట్టణానికి చెందిన థామస్ ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నాడు. అతనికి గతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం ఆ మహిళ భర్తకు తెలిసింది. దీంతో ఆ మహిళ, ఆమె భర్త మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే తమ మధ్య గొడవలు జరగడానికి థామస్ కారణమని భావించిన ఆ దంపతులు అతన్ని హత్య చేయాలని ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. పథకం ప్రకారం మంగళవారం ఉదయం థామస్‌కు ఫోన్ చేసిన ఆ మహిళ అతన్ని గాంధీ పార్క్ వద్దకు రావాలని కోరింది.
అయితే థామస్ అక్కడికి రాగానే ఆ మహిళ, ఆమె భర్త అతనిపై కత్తితో దాడి చేశారు. అనంతరం దంపతులిద్దరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. దీంతో పోలీసులు హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి.. థామస్ మృతదేహాన్ని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇక, థామస్‌కు ఫోన్ రావడంతో ఇంటి నుంచి హడావుడిగా బయటకు వెళ్లాడని అతని తల్లిదండ్రులు తెలిపారు. పక్కా ప్లాన్‌తోనే తమ కుమారుడిని హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.