మిస్టరీ వీడిన ఒంగోలు తల్లీబిడ్డ హత్యకేసు.. అతడే హంతకుడు

నిందితుడు పేరు కోటేశ్వరరావు. స్వస్థలం అద్దంకి. కోటేశ్వరరావు ఒంగోలులోని ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో ఐసియు విభాగంలో పనిచేస్తున్నాడు.

news18-telugu
Updated: December 11, 2019, 4:26 PM IST
మిస్టరీ వీడిన ఒంగోలు తల్లీబిడ్డ హత్యకేసు.. అతడే హంతకుడు
తల్లీ బిడ్డ దారుణ హత్య
  • Share this:
ఒంగోలులో సంచలనం రేపిన తల్లీబిడ్డ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఘటన జరిగిన వారం తర్వాత పట్టుబట్టాడు. భర్తే.. కట్టుకున్న భార్య, కన్న కూతురిని హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడు పేరు కోటేశ్వరరావు. స్వస్థలం అద్దంకి. కోటేశ్వరరావు ఒంగోలులోని ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో ఐసియు విభాగంలో పనిచేస్తున్నాడు. విచారణ నిమిత్తం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్య, బిడ్డను ఎందుకు హతమార్చాడన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

డిసెంబరు 3న మద్దిపాడు మండలం మారెళ్లగుంటవారిపాలెం- పేర్నమిట్ట డొంక మధ్య తల్లీ బిడ్డను హత్య చేసి, తగలబెట్టారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో రెండు మృతదేహాలను గుర్తించారు. ఈ కేసును చేధించేందుకు పోలీసులు 14 బృందాలగా రంగంలోకి దించారు. ఓ వ్యక్తి మహిళ, ఆమె బిడ్డను ద్విచక్రవాహనంపై తీసుకువెళుతున్న దృశ్యాలు సిసి పుటేజి ద్వారా పోలీసులకు అందాయి. ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ వాహనం ఎక్కడిది, ఎవరిది? అనే వివరాలు సేకరించి.. ఎట్టకేలకు నిందితుడు కోటేశ్వరరావును పట్టుకున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: December 11, 2019, 4:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading