ఒంగోలు మహిళా ఎస్సై అత్యుత్సాహం... పోలీస్ జీపు నడపడంతో ప్రమాదం

ఎస్సై అత్యుత్సాహమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. డ్రైవర్ ఉన్నప్పటికీ ఎస్సై నీలిమ స్వయంగా వాహనం డ్రైవ్ చేశారు.

news18-telugu
Updated: November 19, 2019, 3:48 PM IST
ఒంగోలు మహిళా ఎస్సై అత్యుత్సాహం... పోలీస్ జీపు నడపడంతో ప్రమాదం
ఎస్సై అత్యుత్సాహమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. డ్రైవర్ ఉన్నప్పటికీ ఎస్సై నీలిమ స్వయంగా వాహనం డ్రైవ్ చేశారు.
  • Share this:
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక మహిళా ఎస్సై రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సంతనూతలపాడు ఎస్సై నీలిమ ఒంగోలులో రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై అత్యుత్సాహమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. డ్రైవర్ ఉన్నప్పటికీ ఎస్సై నీలిమ స్వయంగా వాహనం డ్రైవ్ చేశారు. ఒంగోలు, కర్నూల్ బైపాస్ రోడ్డు దగ్గర ఎస్సై డ్రైవింగ్ చేస్తుండగా జీపు అదుపు తప్పి ఓ షాపు మీదకి దూసుకుపోయింది. అంతే వేగంతో ఎస్సై జీపును వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తుండగా అదే సమయంలో అటు నుంచి వస్తున్న ఓ లారీ జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
First published: November 19, 2019, 3:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading