Home /News /crime /

ప్రకాశం జిల్లాలో కిడ్నాప్ అయిన బాలుడు ఆరుష్ ఏలూరులో...

ప్రకాశం జిల్లాలో కిడ్నాప్ అయిన బాలుడు ఆరుష్ ఏలూరులో...

కిడ్నాప్ అయిన బాలుడు ఆరుష్ రెడ్డి (File)

కిడ్నాప్ అయిన బాలుడు ఆరుష్ రెడ్డి (File)

ప్రకాశం జిల్లాలో నెలరోజుల క్రితం కిడ్నాప్ కి గురైన బాలుడు ఆరూష్ రెడ్డిని ఏలూరులో పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.

    ప్రకాశం జిల్లాలో నెలరోజుల క్రితం కిడ్నాప్ కి గురైన బాలుడు ఆరూష్ రెడ్డిని ఏలూరులో పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం రెడ్డి నగర్ లో.. జూన్ నెల 24న అరుష్ రెడ్డి కిడ్నాప్‌నకు గురయ్యాడు. 33 రోజుల తర్వాత ఏలూరు ఇందిరా కాలనీ లో బాలుడు ఉన్నాడని సమాచారం అందింది. బాలుడి ఒంటిపై గాయాలు ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, బాలుడి గురించి ప్రకాశం జిల్లా పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఏలూరు ఇందిరా నగర్ లో బాలుడు లభ్యం అయ్యాడు. ఆరుష్ రెడ్డి అవునా? కాదా అనే విషయం నిర్ధారించడం కోసం తల్లిదండ్రులను ఏలూరు తీసుకువెళ్తున్నారు పోలీసులు. తల్లిదండ్రులు నిర్ధారించాకే బాలుడు ఎవరు అనేది చెప్తామని, అప్పటిదాకా ఆ బాలుడు ఆరుష్ రెడ్డి అని చెప్పలేమని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ న్యూస్18 కి తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Crime, Ongole, Prakasham dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు