ముంబై ఓఎన్‌జీసీలో భారీ ఫైర్ యాక్సిడెంట్.. అగ్నికి ఐదుగురు ఆహుతి..

ONGC Fire accident: ముంబైలోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లోని కోల్డ్‌ స్టోరేజీలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అగ్నికి ఆహుతి అయ్యారు.

news18-telugu
Updated: September 3, 2019, 10:26 AM IST
ముంబై ఓఎన్‌జీసీలో భారీ ఫైర్ యాక్సిడెంట్.. అగ్నికి ఐదుగురు ఆహుతి..
ఓఎన్‌జీసీలో అగ్ని ప్రమాదం (ANI Photo)
  • Share this:
నవీ ముంబయిలోని ఉరాన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లోని కోల్డ్‌ స్టోరేజీలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అగ్నికి ఆహుతి అయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అప్రమత్తమైన ఓఎన్‌జీసీ అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని 50 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా, రూ. కోట్ల విలువైన యంత్ర సామగ్రి, ఇతర ఉపకరణాలు, ముడి చమురు దగ్ధమయ్యాయి. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉండవచ్చని, ఘటనపై విచారణ చేపడతామని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో 1.5 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు.

అయితే, ఈ ప్రమాదం వల్ల ఆయిల్‌ ప్రాసెసింగ్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని సిబ్బంది తెలిపారు. గ్యాస్‌ను హజిరా ప్లాంట్‌కు మళ్లించినట్లు వెల్లడించారు.

Published by: Shravan Kumar Bommakanti
First published: September 3, 2019, 10:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading