Young Lady Cheating: ఆమె వయసు 20 నుంచి 25 ఏళ్లు ఉంటాయి.. చూడడానికి చక్కగా ఉంది.. రోడ్డుపై నిలబడి అటు వెళ్తున్న బైక్ లను లిఫ్ట్ అడుతోంది. అత్యవసరంగా వెళ్లాలని వేడుకుంటోంది. అయ్యో పాపం ఎంత అవసరమో అనుకున్నాడు ఓ వాహనదారుడు.. జాలి చూపించి అతడు లిఫ్ట్ ఇచ్చాడు. అంత వరకు అంతా బాగానే ఉంది. బైక్ పై కూడా ఏవో తన కష్టాలు ఇవి చెబుతూ వెళ్తోంది. అయితే ఆమె గమ్యస్థానం వచ్చింది.. ఇక దిగండి అని ఆ వాహనదారుడు చెప్పగానే షాక్ ఇచ్చింది. దీంతో యువకుడు కేకలు వేశాడు. హెల్ప్ హెల్ప్ అంటూ అరిచాడు. అయితే పక్కనే స్థానికులు భారీగా ఉండడంతో వెంటపడి ఆ యువతని పట్టుకుని.. పోలీసులకు అప్పచెప్పారు.. పోలీసులు స్థానికులు చెప్పిన వివరాలు ప్రాకరం. విజయనగరం వైపు నుంచి బైక్పై గజపతినగరం వస్తున్న పైనాన్స్ వ్యాపారి చింత సత్యనారాయణ రెడ్డిని గొట్లాం సమీపంలో సామంతుల లక్ష్మి అనే యువతి బైక్ లిఫ్ట్ అడిగింది. గజపతినగరం బ్రిడ్జి ముందు ఉండే దావాలపేట రోడ్డు సమీపంలో బైక్ ఆపి దిగింది. అదే సమయంలో సత్యనారాయణ రెడ్డి మెడలో మూడున్నర తులాలు చైన్ తెంపుకొని పారిపోయింది. సత్యనారాయణ రెడ్డి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు, సమీపంలో ఉన్నవారందరూ ఆమెను వెంబండించి పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమెపై గతంలోనూ చైన్ దొంగతనం కేసు ఉందని పోలీసులు తెలిపారు. లక్ష్మిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు గజపతినగరం సీఐ రమేష్ తెలిపారు.
ఇటీవల విజయనగరంలో ఇలాంటి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గతంలో యువతుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి వాళ్లకు లిఫ్ట్ ఇవ్వొద్దు అంటూ హెచ్చరికలు చేశారు. అయినా ఈ ముఠా ఆగడాలు ఆగడం లేదు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక్కో అమ్మాయి ఒక్కో రద్దీ జంక్షన్ ను ఎంచుకుంటారు. రోడ్డుపై బైక్ లేదా కారుపై ఒంటరిగా వెళ్తున్న సమయంలో.. అక్కడ ప్లాన్ ప్రకారం నిలబడ్డ టీనేజ్ అమ్మాయి లిఫ్ట్ అడుతుతుంది. ఒంటరిగా ఉండి లిఫ్ట్ అడిగితే ఏం చేస్తారు.. అందులోనూ ఆమె అత్యవసరం.. అర్జెంటుగా వెళ్లాలి.. ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే కాదనగలరా.. సాధారణంగా అమ్మాయి అలా లిఫ్ట్ అడిగితే.. ఏదో అవసరం ఉంటుంది లే.. లేదంటే ఆడపిల్ల లిఫ్ట్ ఎందుకు అడుగుతుంది అని.. ఏం ఆలోచించకుండా లిఫ్ట్ ఇచ్చే వాళ్లు చాలామంది ఉంటారు. అందరూ అదే చేస్తూ చేతి చమురు వదలించుకుంటున్నారు.
ఈజీ మనీ సంపాదించాలి అనుకున్న మహిళలంతా ఇలా ముఠాగా ఏర్పడి వాహనదారులను దోచేస్తున్నారు. అయితే ఇందులో రెండు రకాలు.. కొంతమంది యువతులు చైన్ స్నాచింగ్ లేదా.. పరుసు. ముబైల్ ఫోన్ లాంటివి దొంగలిస్తారు. మరో బ్యాచ్ ఉంది. అది మరీ డేంజర్. లిఫ్ట్ పేరుతో బైక్ ఎప్పి.. వాహనం నడుపుతున్నవారిని కవ్వించే ప్రయత్నం చేసింది.. వారి దగ్గర డబ్బు గుంజుతారు. వారి మాయమాటల్లో పడి మోజులో పడితే అన్నీ దోచేస్తారు..
కాదని ఎవరైనా ఎదురు తిరగాలి ప్రయత్నిస్తే.. లిఫ్ట్ పేరు చెప్పి అత్యాచారానికి ప్రయత్నించాడని బ్లాక్ మెయిల్ కు దిగుతానని బెదిరిస్తారు. వాళ్లతో ఎందుకు పరువు పోతుందని భయపడేవారు ఎంతో కొంత ఇచ్చి.. సైలెంట్ గా వెళ్లిపోతారు.. కొందరు మాత్రం తమ తప్పులేనప్పుడు ఎందుకు భయపడాలి అని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇలాంటి యువతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి: ఓ బామ్మ కొంప ముంచి ఆధార్ కార్డు.. అసలేం జరిగిదంటే..?
ఇటీవల కాలంలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీరు వాహనదారులనే టార్గెట్ చేస్తారు. లిఫ్ట్ అడుగుతారు ఆ తర్వాత పాపం అని లిఫ్ట్ ఇచ్చాక దారిలో నిలువునా దోపిడీ చేసేస్తారు. ప్రస్తుతం దోపిడీలో ఇదో ట్రెండ్ అయిపోయింది. అయ్యో పాపం అని కొంచెం జాలిపడి బైక్ ఆపాము అనుకోండి మన మీద జాలి చూపించకుండా నిలువునా దోచేస్తారు. ఇలాంటి దోపిడీలు ఎన్నో తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఇటీవల దారి దోపీడీల విషయంలో భారీ నేర చరిత్ర ఉన్న గంటా తులసి అనే మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టారు. ఆమెపై గతంలో 20 కేసులు ఉన్నట్లు తేలింది. సో బీ కేర్ ఫుల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Vizianagaram