హోమ్ /వార్తలు /క్రైమ్ /

Forced Marriage: బలవంతంగా పెళ్లి చేస్తున్నారని.. చివరికి ఆ పని చేశాడు.. షాక్ లో పేరెంట్స్

Forced Marriage: బలవంతంగా పెళ్లి చేస్తున్నారని.. చివరికి ఆ పని చేశాడు.. షాక్ లో పేరెంట్స్

బలవంతపు పెళ్లి ఇష్టం లేక మర్మాంగాన్ని కోసుకున్న యువకుడు

బలవంతపు పెళ్లి ఇష్టం లేక మర్మాంగాన్ని కోసుకున్న యువకుడు

వద్దని చెబుతున్నా ఇంట్లో వాళ్లు కుదరదన్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చారు.. దీంతో బలవంతపు పెళ్లికి సద్ధమవ్వలే్క ఎవ్వరూ ఊహించని పని చేశాడు. దీంతో అంతా షాక్ కు గురయ్యారు.

  ఈ మధ్య మనుషుల ప్రవర్త వింతంగా మారింది. ప్రతి దానికి అతిగా రియాక్ట్ అయ్యే వాళ్లు పెరిగిపోతున్నారు. చిన్న చిన్న కారణాలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత పెళ్లి విషయంలో ఎవ్వరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు అయితే ఇష్టం లేని పెళ్లికి ఒప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.. లేదా ఎదుటి వారి ప్రాణాలు తీసేస్తున్నారు. తమ మనసులోని వేదనను తల్లి దండ్రులతో చెప్పుకోలేక క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజంగా పెళ్లి ఇష్టం లేనప్పుడు తల్లిదండ్రులను ఒప్పించగలగాలి.. తాజాగా చెన్నైలో ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చింది. ఇస్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఎవ్వరూ ఊహించని పని చేశారు.

  చెన్నైలోని గాంధీ నగర్ కు చెందిన మురుగన్ కుమారుడు 23 ఏళ్ల విజయరాఘవన్ కు పెళ్లి చేయాలని అతడి తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే తనకు రెండేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాడు. అయినా అయినా వినకుండా కుటుంబీకులు అతనికి ఓ యువతితో వచ్చేవారం నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. పెళ్లి వద్దు అన్నా వినని తల్లిదండ్రుల నుంచి తప్పించుకునేందుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ యువకుడు..

  బలవంతంగా పెళ్లి చేస్తున్నారనే కోపంతో ఆవేశాన్ని అదుపులోకి తెచ్చు కోలే ఉలితో పురుషాంగాన్ని కోసుకున్నాడు. తను ఇక పెళ్లికి పనికిరానంటూ కేకలేశాడు. తల్లిదండ్రులు అతనిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు సేలం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హడావుడిలో చేతిలో వున్న ఉలి గొంతుకు తగలడంతో అక్కడా తీవ్రంగా గాయమైంది. కుటుంబీకులు అతనిని ఆత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Chennai, Crime news, Tamil

  ఉత్తమ కథలు