One Year Old Child: పాపం పసివాడు.. అంత పై నుంచి పడిన ఆ పసి ప్రాణం ఎంతలా తల్లడిల్లిందో..

రివాన్, పడిపోయిన దృశ్యం

గ్రేటర్ నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ.. ఆడుకుంటూ 12వ అంతస్తు పై నుంచి కింద పడి ఏడాది వయసున్న బాబు చనిపోయిన ఘటన గ్రేటర్ నోయిడాలోని బిస్రక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని కాసా గ్రీన్-వన్ హౌసింగ్ సొసైటీలో సత్యేంద్ర కుటుంబం నివాసముంటోంది.

  • Share this:
    నోయిడా: గ్రేటర్ నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ.. ఆడుకుంటూ 12వ అంతస్తు పై నుంచి కింద పడి ఏడాది వయసున్న బాబు చనిపోయిన ఘటన గ్రేటర్ నోయిడాలోని బిస్రక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని కాసా గ్రీన్-వన్ హౌసింగ్ సొసైటీలో సత్యేంద్ర కుటుంబం నివాసముంటోంది. 12వ ఫ్లోర్‌లో వీళ్ల ఫ్లాట్ ఉంది. సత్యేంద్రకు ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. పేరు రివాన్. గత సోమవారం రివాన్ బర్త్‌డే. ఆదివారం సాయంత్రం నుంచే ఇల్లంతా సందడిగా ఉంది. మొదటి పుట్టినరోజు కావడంతో కొడుకు పుట్టినరోజును ఘనంగా చేయాలని సత్యేంద్ర భావించాడు. బంధుమిత్రులంతా ఆదివారం రాత్రి సమయానికే సత్యేంద్ర ఫ్లాట్‌కు చేరుకున్నారు. పుట్టినరోజు డెకరేషన్‌లో అంతా బిజీగా ఉన్నారు. రివాన్ ఫ్లాట్ బయట ఆడుకుంటూ ఉన్నాడు. కొంతమంది పిల్లలు కూడా అక్కడే ఆడుకుంటూ ఉండటంతో రివాన్‌ను ఎవరూ గమనించలేదు.

    రివాన్ ఆడుకుంటూ వెళ్లి దురదృష్టవశాత్తూ రైలింగ్ మధ్యలో పడిపోయాడు. అలా పడిన పిల్లాడు ఏకంగా కింది ఫ్లోర్ వరకూ వెళ్లి పడ్డాడు. అంత ఎత్తు నుంచి పిల్లాడు పడిపోవడంతో ఒకేఒక్కసారి గుక్కపట్టి ఏడ్చిన శబ్ధం వినిపించింది. ఏమైందా అని అంతా బయటకు వచ్చి చూసేసరికి రివాన్ కనిపించలేదు. రివాన్ ఆడుకుంటున్న బొమ్మలు రైలింగ్ దగ్గరలో కనిపించాయి. వెంటనే అనుమానమొచ్చి కిందకు చూస్తే.. విగత జీవిగా రక్తపు మడుగులో రివాన్ కనిపించాడు. ఈ ఘటనతో రివాన్ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యారు. ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. అదంతా కల అయి ఉంటే బాగుండని అంతా అనుకున్నారు.

    ఇది కూడా చదవండి: Daughter In Law: వామ్మో.. ఈ కోడలు మరీ ఇలా ఉందేంటి.. ఈ సంగతి తెలిసి ఇరుగుపొరుగు ఉలిక్కిపడ్డారు..!

    కానీ.. యదార్థాన్ని ఎవరూ మార్చలేకపోయారు. అంతా కిందకు వెళ్లి పిల్లాడిని చూడగా అప్పటికే రివాన్ చనిపోయి కనిపించాడు. తన కొడుకు చనిపోలేదని.. కాసేపట్లో మొదటి పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడని ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఎంత ఆనందభరిత క్షణమైనా పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉంటేనే మేలు. ఆ పిల్లాడిని అక్కడున్న వారిలో ఏ ఒక్కరు గమనించినా ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. అప్పటిదాకా కిలకిలలతో కళకళలాడిన సత్యేంద్ర ఇల్లు ఈ దురదృష్ట ఘటనతో మూగబోయింది. ఆ సొసైటీ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
    Published by:Sambasiva Reddy
    First published: