Remembering Disha: మానవ మృగాల ఘాతుకానికి ఏడాది.. అర్ధాంతరంగా ముగిసిన యువతి జీవితం..

యావత్ దేశాన్ని ఒక్కతాటిపై నిలిపిన ఆ ఘటన జరిగి నేటికి ఏడాది. ఒక యువతిని అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసి.. ఆ పై ఆమెను తగులబెట్టిన ఆ దారుణానికి ఏడాది గడిచిపోయింది. కాలచక్రం గిర్రున తిరిగింది. కానీ ఆ ఘాతుకం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది.

news18
Updated: November 27, 2020, 1:00 PM IST
Remembering Disha: మానవ మృగాల ఘాతుకానికి ఏడాది.. అర్ధాంతరంగా ముగిసిన యువతి జీవితం..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 27, 2020, 1:00 PM IST
  • Share this:
అత్యంత దారుణమైన ఆ గ్యాంగ్ రేప్ (gang rape) జరిగి నేటికి సరిగ్గా ఏడాది. ఏడాది క్రితం 26 ఏళ్ల ఓ యువతి.. కామాంధుల (rapists) చేతుల్లో బలైంది. తాగుబోతులు ఆమెను చిదిమేసి, తగులబెట్టగా అర్ధాంతరంగా ఆ వైద్యురాలు బలవంతంగా తనువు చాలించాల్సి వచ్చిన రోజు. ఆ కాళరాత్రి ఆపన్న హస్తం అందక ఆమె పడ్డ వ్యధ అంతా అరణ్య రోదనైంది ఏ అడవిలోనో అనుకోకండి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు (airport) పట్టుమని 10 కి.మీ. దూరంలో జరిగిన ఘోరం ఇది.  ఎక్కడో చదివినట్టో... విన్నట్టో అనిపిస్తంది కదా..? మీ అనుమానం నిజమే. ఈ వార్త దిశ గురించే. ఆ ఘాతుకం జరిగి నేటికి ఏడాది.

ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై ద్విచక్ర వాహనాలను అనుమతించరు కనుక అక్కడే తన స్కూటీని (scooty) పార్క్ చేసి సిటీలోకి వచ్చేందుకు క్యాబ్ తీసుకున్న ఆమెను చూసిన లారీ డ్రైవర్ల్ (lorry drivers) గ్యాంగ్ ఆమె తిరిగి వచ్చేసరికి పకడ్బందీ ప్లాన్ తో రెడీగా ఉండి కాటేశారు. తిరిగి వచ్చిన ఆమె తన బండి పంక్చర్ అయిందని చూస్తుండగానే సాయం చేస్తామంటూ వచ్చిన వారి మాయ మాటలు వినడంతో అఘాయిత్యానికి బలైంది.

రాత్రి 9 గంటలకు...

2019 నవంబర్ 27, ఓవైపు చలి మరోవైపు చిమ్మ చీకటి. రాత్రి 9 గంటలకు గచ్చిబౌలీ వెళ్లిన యంగ్ వెటర్నరీ డాక్టర్ (veterinary doctor) మానవ మృగాల చేతుల్లో బలైంది. సరిగ్గా ఆ అఘాయిత్యానికి నేటితో ఏడాది. శంషాబాద్ (Shamshabad) తొండుపల్లి టోల్ ప్లాజా (toll plaza) వద్ద జరిగిన ఆ ఘోరం తరువాత జరిగిన ఎన్ కౌంటర్ (encounter) మానవ మృగాలకు గట్టి షాక్ ఇచ్చింది.

ఆ రాత్రి ఆమెకు కాళరాత్రే...

ఆమె స్కూటీని పార్క్ చేయడం, క్యాబ్ లో వెళ్లటాన్ని చూస్తున్నప్పుడు మద్యం సేవిస్తున్న నలుగురు లారీ డ్రైవర్సు క్లీనర్లు ఆమెపై కన్నువేశారు. ఆతరువాత అదేపనిగా బండి పంక్చర్ చేశారు. విషయం తెలియని ఆ అమ్మాయి సాయం చేస్తామన్న ఆ మాయగాళ్ల మాట నమ్మింది. అంతే క్షణాల్లో ఆమెను కిడ్నాప్ చేసి, అఘాయిత్యానికి పాల్పడి, ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. ఆతరువాత హైవేకు దగ్గర్లోనే ఉన్న ఓ నిర్మానుష్యమైన ప్రాంతంలో పెట్రోల్ పోసి తగులబెట్టారు. యావత్ దేశాన్ని వణింకించేలా చేసిన ఈ వార్త దావానలంలా వ్యాపించి, తెలంగాణ ప్రభుత్వం పరువు తీసింది.

సోదరికి కాల్... 

ఇలా కిరాతకుల చేతుల్లోకి వెళ్లేముందు బాధితురాలు తన సోదరికి ఫోన్ కాల్ చేసి, తన చుట్టూ భయంకరమైన వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, బండి పంక్చర్ అయిందని, ఏం చేయాలో తోచడం లేదని చెప్పుకునే ఆడియో టేప్స్ ఇప్పటికీ నెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే క్యాబ్ లో ఇంటికి వచ్చేయాలని, దగ్గర్లోనే టోల్ ప్లాజా ఉంది కనుక అక్కడికి వెళ్లి నించోవాలని కూడా ఆమె సోదరి సలహా ఇచ్చింది. ఈలోగా కామాంధుల చేతుల్లో ఆమె బందీ అయి, బలైపోయింది. 2012లో నిర్భయ ఘటన జరిగాక ఆ స్థాయిలో సంచలనం సృష్టించిన కేసుగా, దిశ కేసుగా యువ వైద్యురాలి కేసు సంచలనం సృష్టించింది. మరో వైపు ప్రజాందోళన తీవ్రం కావడంతో ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం తక్షణం నిందితులను అరెస్ట్ చేసింది. సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా వారిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా వారు తప్పించుకునే ప్రయత్నం చేయగా, నిందితులందరినీ పోలీసులు కాల్చి చంపారు.

మార్పు తెచ్చినట్టే ఉంది....!

శంషాబాద్ టోల్ ప్లాజా వద్ద జరిగిన భయానక సంఘటన సమాజంలో కాస్త మార్పు తెచ్చేందుకు కారణమైంది. ఈ ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చి, దిశ పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో రాత్రి పూట గస్తీ మరింత పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లపై ఖాకీ నిఘా పెరిగింది. ఏదైనా సమస్య వస్తే వెంటనే ఫోన ్చేయాలనే స్పృహ, ఆలోచన ఎక్కువ మందిలో వస్తోంది. స్పెషల్ మొబైల్ యాప్ ల వినియోగం విపరీతంగా పెరిగింది. మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ కేసులను శరవేగంగా ఛేదించేందుకు పోలీసులు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు ఆడిబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే చావు తప్పదని, ఎన్ కౌంటర్ల భయం క్రిమినల్స్ ను పట్టుకుంది.
Published by: Srinivas Munigala
First published: November 27, 2020, 12:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading