భూదేవికి ఉన్నంత ఓర్పు మహిళకు ఉంటుందంటారు. కానీ. కానీ ఆ సహనాన్ని కూడా పరీక్షించాలని హద్దులు దాటితే ఏం అవుతుంది.. ఆడదే అపర కాళి అవుతుంది. ఓపిక పట్టినంత సేపే ఏదైనా.. ఆమె గీత దాటి బయటకు వచ్చిందంటే నిలబడడం ఎవరితరం కాదు.. పురాణాల నుంచి ఈ మాట వింటున్నాం.. అయినా కొందరికి బుద్ధి రావడం లేదు. ఆడది కదా ఆమె ఏం చేస్తుందులే అని పిచ్చి వేషాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒంటరి ఆడవాళ్లు కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. ఇక పోకీరిలు, తాగుబోతుల లీలల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఒంటరిగా ఆడది కనిపిస్తుందా.. వెకిలి వేషాలు వేద్దామా అని చూస్తూ ఉంటారు. పోకిరీలు, తాగుబోతులతో తమకెందుకు లే అని వారు తలదించుకుని వెలిపోతుంటారు. అందుకే ఇలాంటి పోకీరాల ఆగడాలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో ఓ పోకిరీ వెకిలి వేషాలు వేశాడు. పీకల దాకా తాగిన అతడు షాపు దగ్గరకు వెళ్లాడు. అక్కడ మహిళ ఒంటరిగా ఉండడంతో రెచ్చిపోవాలని అనుకున్నాడు. ఆమెను టార్గెట్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.. కాసేపు సహనంగా సమాధానం చెప్పినా.. అతడు వెనక్కు తగ్గలేదు.. వాదనకు దిగాడు. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ తిరగబడింది..
కాబోయే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం.. అందులోను నగరంలోని ఆరిలోవ ప్రాంతం అంటే ఇప్పుడు రౌడీలకు అడ్డాగా మారిపోయింది. ఆకు రౌడీ నుంచి రౌడీ షీటర్ వరకు అంతా అక్కడ నుంచే పుట్టుకొస్తున్నారు. వారి అండదండలు చూసుకుని పోకిరీలు కూడా పెరిగిపోతున్నారు. దీంతో అక్కడ ఉన్న మహిళలే కాదు.. అటు వైపు వెళ్లాలన్నా.. ఇతర ప్రాంతాల మహిళలు భయపడుతున్నారు. అయితే రోజు రోజుకూ ఆకతాయిల వేధింపులు భరించలేకపోతున్న ఓ మహిళ సహనం కోల్పోయింది. మహిళ శక్తి ఏంటి అతడికి తెలిసి వచ్చేలా చేసింది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Viral Videos, Vizag