Student Tries To Kill Principal: ఎక్కడైనా గురు శిష్యుల బంధానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా స్కూళ్లు.. కాలేజీల్లో ఉపాధ్యాయులన్నా.. ప్రిన్సిపాల్ (Principal) అన్నా చాలా గౌరవం ఇస్తారు విద్యార్థులు (Students).. వారు చెప్పినదానికి ఊ కొట్టడమే తప్ప.. ఎదురు చెప్పాలంటే భయమేస్తుంది. కానీ భయ భక్తులు ప్రదర్శించాల్సిన ప్రిన్సిపల్ నే హత్య (Murder) చేయాలని ప్రయత్నించాడు ఓ విద్యార్థి. అది కూడా తనను స్కూల్ నుంచి సస్పెండ్ చేశారన్న కోపంతో ఓ టీనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా స్కూల్ ప్రిన్సిపాల్ ని హత్య చేసేందుకు ప్రయత్నం (try to killing) చేశాడు. రాజస్తాన్ (Rajasthan) లోని ధోల్పూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అతడిని స్కూల్ నుంచి బహిష్కరించారు. గతేడాది ఈ ఘటన జరిగింది. ఏడాది దాటినా ఆ టీనేజర్ మర్చిపోలేదు. నిన్న నేరుగా ప్రిన్సిపాల్ అఫీసులోకి వెళ్లాడు. నాటు తుపాకీని ప్రిన్సిపాల్ తలపై ఎక్కు పెట్టాడు. ఫైరింగ్ చేసేందుకు ట్రై చేశాడు. సమయానికి ట్రిగ్గర్ జామ్ కావడంతో ప్రిన్సిపాల్ బతికిపోయాడు.
వెంటనే భయంతో ప్రిన్సిపల్ కేకలు వేశారు.. ఆ కేకలు విన్న దగ్గర్లో ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు పరుగు పరుగున అక్కడ గుమి గూడారు. ఆ విద్యార్థిని అంతా కలిసి బంధించారు. వారు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు టీనేజర్ ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ టీనేజర్ తన కజిన్ ను తీసుకెళ్లేందుకు స్కూల్ కి వచ్చాడు. కజిన్ ని ఇంటికి దగ్గర దించేశాడు. ఆ తర్వాత మళ్లీ స్కూల్ దగ్గరికి వచ్చాడు. నేరుగా ప్రిన్సిపాల్ భగవాన్ త్యాగీ ఆఫీసులోకి వెళ్లాడు. నాటు తుపాకీతో ప్రిన్సిపాల్ ను కాల్చి చంపాలని ట్రై చేశాడు. ట్రిగ్గర్ జామ్ కావడంతో ప్రిన్సిపాల్ ప్రాణాలు దక్కాయని ధోల్పూర్ ఎస్పీ కేసర్ సింగ్ చెప్పారు.
ఇదీ చదవండి: కొత్తకారు కొన్నామన్న ఆనందం.. దైవ దర్శనానికి వెళ్లాలనే ఉత్సాహం.. కానీ ఇంతలోనే..
అయితే విద్యార్థిని గన్ తో చూసినప్పుడే చాలా భయం వేసిందని ప్రిన్సిపాల్ అంటున్నారు. ఇక నాటు తుపాకీ ఎక్కు పెట్టి తనను చంపేందుకు ట్రై చేయడంతో ప్రిన్సిపాల్ పూర్తిగా హడలిపోయారు. దాదాపు ప్రాణం పోయింది అనుకున్నానని పోలీసులకు వివరించారు. ఆ తర్వాత ఆయన కేకలు వేయడంతో పాటు అలార్మ్ మోగించారు. అలార్మ్ శబ్దం విన్న వెంటనే స్కూల్ సిబ్బంది లోపలికి వెళ్లారు. అక్కడి సీన్ చూసి షాక్ తిన్నారు. ఆ వెంటనే టీనేజర్ ను పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, టీచర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో ఏడాది క్రితం టీనేజర్ ను స్కూల్ నుంచి బహిష్కరించి టీసీ ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
రోజు రోజుకు మనుషుల్లో హింసాత్మక ధోరణులు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావమో.. సినిమాల ప్రభావమో.. కారణం ఏదైనా టీనేజ్ లోనే యువత పెడదారి పడుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో విద్యార్థి ప్రిన్సిపాల్ కే గన్ ఎక్కుపెట్టాడు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉహించవచ్చు.. ఇలాంటి ఘటనలు చూసిన తరువాత ఉపాధ్యాయుడు విద్యార్థులను మందలించాలి అంటేనే భయపడతారేమో?
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER CRIME, Rajasthan, Student