హోమ్ /వార్తలు /క్రైమ్ /

Rowdy fellow: ఛీ వీడు మనిషేనా..? పెన్ను.. పెన్సిల్ ఆశ చూపించి పాడుపని..

Rowdy fellow: ఛీ వీడు మనిషేనా..? పెన్ను.. పెన్సిల్ ఆశ చూపించి పాడుపని..

కామాంధుడికి దేహశుద్ధి

కామాంధుడికి దేహశుద్ధి

Misbehaving with school students: చిన్నారి.. బుజ్జీ.. బంగారం అంటూ స్కూల్ పిల్లలని పిలిచేవాడు.. మామయ్య లాంటివాడనో.. బాబాయ్ అనే.. ఆ పిల్లలు అతడితో చనువుగా మాట్లాడేవారు.. దాన్ని అలుసుగా చేసుకున్న కామాంధుడు చిన్నారులు అని చూడకుండా.. అభం శుభం తెలియని వారిపై చేతులు వేసి పైశాచిక ఆనందం పొందేవాడు.. చివరికి ఆ విషయం తల్లిదండ్రుల వరకు వెళ్లింది. వాళ్లేం చేశారంటే..?

ఇంకా చదవండి ...

Misbehaving with school students:  చూసేందుకు పెద్ద మనిషిలా ఉన్నాడు. కాస్త రాజకీయ నేపథ్యం ఉంది.. సేవా కార్యక్రమాల పేరుతో అందరినీ పరిచయం చేసుకునేవాడు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు (School Students) మంచి మాటలు చెప్పి.. దగ్గరయ్యే వాడు.. చిట్టీ.. బుజ్జీ అంటూ సొంత బాబాయ్,  సొంత మామాయ్యలా కబుర్లు చెప్పేవాడు.. పెన్ను(Pen) , పెన్సిల్ (Pencil), బిస్కెట్ (Biscuit), చాక్లెట్ (Chocolate) కొనిచ్చేవాడు.. కానీ బయటకు కనిపించే ఆ ప్రేమ వెనుక.. దుర్భుద్ధి ఉందని .. కామంతో అతడి కళ్లు మూసుకుపోయాయని.. ఆ బాలికలకు అర్థం కాలేదు.  ఆప్యాయంగా చేరదీస్తున్నాడు అనుకుంటే.. ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి.. కామవాంఛలు తీర్చుకునే వాడు.  అసలు విషయం తెలిసి.. దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే బెదిరింపులకు దిగేవాడు.. విషయం ఎవరికైనా చెబితే అంతుచూస్తాను అని బెదిరించేవాడు..  ఇలా చాలామంది మైనర్లు జీవితాలతో ఆటలాడుకున్నాడు ఆ రౌడీ షీటర్ (Rowdy sheeter) చిన్నారావు..

ఇప్పటికే అతడిపై ఎన్నో వేధింపుల కేసులు ఉన్నాయి. ఒక ప్రాంతంలో అతడి బాగోతం బయట పడితే.. మరో ప్రాంతం విద్యార్థినిలను టార్గెట్ చేసేవాడు.. మొత్తానికి ఎవరికీ దొరకకకుండా ఇన్నాళ్లూ తప్పించుకొచ్చిన అతడి పాపం ఎట్టకేలకు పండింది.  చిన్న బాలికలు, పిల్లలపై అఘాయిత్యాలకి పాల్పడుతున్న అతడి వెకిలి చేష్టలను పిల్లలు.. తమ టీచర్లకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి: గడువు లోపు పోలవరం పూర్తవ్వడం అసాధ్యం.. బాంబు పేల్చిన కేంద్రం

ఆ కాలనీ  మహిళలంతా ఏకమయ్యారు. తమ పిల్లలని వేధిస్తున్న అకృత్యాలపై దృష్టి పెట్టారు.  చిన్నారులకి చాక్లెట్ బిస్కట్ అంటూ ప్రలోభపెట్టి... లైంగిక దాడికి పాల్పడుతున్న ఆ రౌడీషీటర్ ని చితక్కొట్టారు. నడిరోడ్డుపై ఈడ్చిమరీ చావగొట్టి పోలీసులకి అప్పగించారు.

ఇదీ చదవండి: నా పైన రెండు సీబీఐ కేసులే.. అధినేతపై వందల కేసులు.. లోక్ సభలో వైసీపీ ఎంపీల డైలాగ్ వార్

సెటిల్మెంట్లు.. దందాల పేరుతో ఎందర్నో భయపెట్టిన ఆ రౌడీషీటర్ కు మహిళలు బుద్ధి చెప్పారు.  గత కొన్నాళ్ళుగా చిన్నారి‌ బాలికలను వేధింపులకు గురి చేస్తున్న రౌడీ షీటర్ దోమానా చిన్నారావు మహిళల చేతిలో తన్నులు‌ తిన్నాడు.  మల్కాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మహిళల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. 

ఇదీ చదవండి: విశాఖ అందాలను 360 డిగ్రీల్లో చూడాలని ఉందా..? లండన్ ఐ రా రమ్మంటోంది?

ఓ రాజకీయ నాయకుడి అండతో  రౌడీ షీటర్ దోమనా చిన్నారావు రెచ్చి పోతున్నాడని.. ఏ చేసినా భరిస్తున్నామని.. తమ  పిల్లల జోలికి వస్తే ఊరుకోమంటూ మహిళలు హెచ్చరించారు.  వెల్ఫేర్ సొసైటీ ముసుగులో బాలికలపై అఘాయిత్యాలకి తెగబడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:విశాఖ రాజధానికి ముహూర్తం ఇదే?.. లీక్ చేసిన ఏపీ మంత్రి, జగన్‌ సన్నిహిత నేత..

బాలికలందర్నీ ప్రశ్నస్తే.. అతడి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.  చదువుకునేందుకు సామగ్రి ఇస్తానంటూ ఇంటికి తీసుకువెళ్లి  వర్ణించలేని రీతిలో బాలికలతో ప్రవర్తించాడని వారంతా కన్నీరు పెట్టుకున్నారు.  తమ పిల్లలకు ఇలాంటి సాకుతో ప్రలోభపెట్టి... లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడని బాధిత మహిళలు కన్నీళ్లు మున్నీరు అవుతున్నారు.  మహిళలు అంతా కలిసి  కామాంధుడు చిన్నారావుకు దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. బాధితుల కంప్లైంట్‌పై నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.


ఇదీ చదవండి: వైసీపీకి ఊహించని షాక్.. ఆమె అనుమతిస్తే కన్నీళ్లతో కాళ్లు కడుగుతాం.? అధికార పార్టీ ఎమ్మెల్యే

ఇటీవల స్వతంత్ర కార్పోరేటర్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యాడు. నేర ప్రవృత్తి కలిగిన రౌడీ షీటర్ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా పోలీసులే ప్రేరణ ఇచ్చారని అక్కడ ఇక్కడ చిన్నారావు చెప్పినట్టు భోగట్టా..  ఈ నేపథ్యంలో ఓటమి  తరువాత మళ్లీ సేవ కార్యక్రమాలు నిర్వహణ ముసుగులో  పాఠశాలకు వచ్చే  పేద విద్యార్థినిలు ఎంపిక చేసుకుని వారిని ఇంటికి తీసుకుని వెళ్లి వర్ణించలేని రీతిలో ప్రవర్తిస్తున్నట్టు తెలియడంతో మహిళా సంఘాలు.. మహిళలు అంతా ఏకమైన అతడికి బుద్ధి చెప్పారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Visakha, Vizag

ఉత్తమ కథలు