Professor: ఆదివారం పని ఉంది రా అంటూ ఉద్యోగినిని గదిలోకి రమ్మన్న ప్రొఫెసర్.. తరువాత ఏం జరిగిదంటే..?

ప్రతీకాత్మకచిత్రం

ఆదివారం కూడా పని ఉందని నమ్మించాడు.. గదిలోకి రావాలని పిలిచాడు.. ప్రొఫెసర్ రమ్మనడంతో కాదనేలకపోయింది ఆ యువతి..కానీ అక్కడి వెళ్లిన తరువాత తెలిసింది ఆ ఆచార్యుడి అసలు ఉద్దేశం.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా..?

 • Share this:
  అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన కొందరు ఆచార్యులు అడ్డ దారులు తొక్కుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం తమ బాధ్యత అన్న సంగతి మరిచి.. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. తాము ఎక్కడ ఉన్నాం.. ఏం హోదాలో ఉన్నామనే సంగతి మరిచి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సీఎం సొంత జిల్లా కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఓ ప్రొపెసర్ లీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదు చేసిన ఉద్యోగిణి వివరణ ప్రకారం.. ఆదివారం సెలవు కావడంతో సాధరణంగా క్యాంపస్ కు ఎవరూ వెళ్లరు.. అన్ని డిపార్ట్ మెంట్లకు లాక్ వేసి ఉంటుంది. కానీ ఓ ప్రొపెసర్ మాత్రం.. అదే డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న ఉద్యోగిణితో.. ఆదివారం అత్యవసరంగా పూర్తి చేయాల్సిన పని ఉందని తప్పకుండా రావాలి అంటూ ఆదేశాలు జారీ చేశాడు. ప్రొఫెసర్ రమ్మంటే రాను అని చెప్పలేక ఆమె సరే అని తల ఊపింది. చెప్పిన ప్రకారం ఆదివారం కూడా ఆమె క్యాంపస్ కు వచ్చింది. అలా ఒంటరిగా గదిలోకి వచ్చిన ఆ ఉద్యోగిణిపై ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ ఉద్యోగిని ఏడ్చుకుంటూ బయటకి రావడంతో తోటి ఉద్యోగులు ఆమెకు బాసటగా నిలిచారు. ఆచార్యుడు మాట్లాడిన మాటలకు సంబంధించిన వాయిస్‌ రికార్డును బాధితురాలు ఓ అధ్యాపక సంఘం నాయకుడికి పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

  దీంతో ఆచార్యుడిని, ఉద్యోగినిని వేర్వేరుగా పిలిచి ఉన్నతాధికారులు విచారించారు. దీంతో పాటు విశ్వవిద్యాలయం ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌ కమిటీ సభ్యులు సైతం సమావేశమై ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. కాగా మరో ఉద్యోగినికి సైతం రాంగ్‌కాల్స్, అసభ్యకర కాల్స్‌ వస్తుండటంతో ఆమె కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు మూడు నెలల క్రితం ఓ అధ్యాపకుడు ఓ విద్యారి్థని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి సదరు అధ్యాపకుడికి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఫిర్యాదుల నేపథ్యంలో వీటన్నింటిపైనా కమిటీ వేసి విచారణ చేపట్టేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.

  ఇదీ చదవండి:  ప్రభుత్వం తీరుపై నాని ఫైర్.. ఇన్ని ఆంక్షలా అంటూ ప్రశ్న.. సమస్య పరిష్కరించుకోవాలని పిలుపు

  కానీ ఆ ప్రొఫెసర్ మాత్రం తనకు ఏం తెలియదు అంటున్నారు. కావాలనే కొందరు కక్ష కట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. చాలా కాలంగా పదవిలో ఉన్నా.. తాను ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదని.. అక్కడి విద్యార్థులను అడిగితే తన గురించి తెలుస్తుంది అంటున్నాడు. మరిదీనిపై ఉన్నతాధికారులు ఏమంటారో చూడాలి..
  Published by:Nagesh Paina
  First published: