అది అమెరికాలోని మిన్నెయాపోలిస్ నగరం. సమయం అర్ధరాత్రి 12.30 గంటలు. ఓ వ్యక్తి రోడ్డు మీదకి తుపాకీతో వచ్చాడు. ఉన్నట్టుండీ.. ఒక్కసారిగా తుపాకీతో కాల్పుల మోత మోగించాడు. అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక్కరు అక్కడికక్కడే చనిపోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిన్నెయాపోలిస్ నగరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో స్థానికులపై కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానికు పోలీసులు ధ్రువీకరిస్తూ దుండగుడు విచక్షణరహితంగా తుపాకీతో విరుచుకుపడినట్టు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగా, స్థానికులు బయటకు రావొద్దంటూ పోలీసులు పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఈ ఘటన ఓ వ్యక్తి ఫేస్ బుక్ లైవ్ ఆధారంగా వెలుగులోకి రావడం కొసమెరుపు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.