లేడీ డాక్టర్లకు లైంగిక వేధింపులు... సర్వేలో షాకింగ్ విషయాలు

ఫోన్ కాల్స్, మేసేజ్‌లు, ఈ-మెయిల్స్ ద్వారా అనేకమంది లేడీ డాక్టర్లను వేధిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది ఆ డాక్టర్ల చేతిలో వైద్యం పొందిన పేషెంట్లే కావడం గమనార్హం.

news18-telugu
Updated: October 1, 2019, 7:14 PM IST
లేడీ డాక్టర్లకు లైంగిక వేధింపులు... సర్వేలో షాకింగ్ విషయాలు
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
మన ప్రాణాలు కాపాడే డాక్టర్లు అంటే మనలో చాలామందికి గౌరవభావం ఉంటుంది. కానీ... అలాంటి డాక్టర్లకు కూడా నేటి సమాజంలో లైంగిక వేధింపుల సర్వసాధారమయ్యాయి. ఇంగ్లాండ్ దేశంలో జరిపిన ఓ సర్వేలో ఇందుకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దేశంలోని ప్రతి ఐదుగురు మహిళా డాక్టర్లలో ఒకరు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నవారే. మెడ్‌స్కేప్ అనే న్యూస్ సంస్థ గత మూడేళ్లలో నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఫోన్ కాల్స్, మేసేజ్‌లు, ఈ-మెయిల్స్ ద్వారా అనేకమంది లేడీ డాక్టర్లను వేధిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది ఆ డాక్టర్ల చేతిలో వైద్యం పొందిన పేషెంట్లే కావడం గమనార్హం.

వీరిలో ఎక్కువమంది లేడీ డాక్టర్లను తమతో డేట్‌కు రావాలని కోరారట. కొన్నిసార్లు తోటి డాక్టర్ల నుంచి కూడా లేడీ డాక్టర్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. మూడేళ్లలో 1,378 మంది లేడీ డాక్టర్ల నుంచి అభిప్రాయాలను సేకరించి సర్వే వివరాలను వెల్లడించారు. గత మూడేళ్లలో 21 శాతం మంది డాక్టర్లకు ఈ రకమైన వేధింపులు ఎదురయ్యారని తేలింది. వీరిలో కొంతమంది తమకు ఎదురైనా ఈ రకమైన అనుభవాలను చెప్పడానికి నిరాకరించారు. వీరిలో 17 శాతం మందికి పేషెంట్ల ద్వారానే వేధింపులు ఎదుర్కోగా... మూడు శాతం మందికి ఇతరులతో ఇబ్బందులు వచ్చాయి. 12 మంది లేడీ డాక్టర్లకు ఇలాంటి వేధింపులు ఎదురుకావడంతో... జూలైలో బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ దీనిపై కమిటీ కూడా వేసింది.

First published: October 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading