Home /News /crime /

ONE MPDO VIDEO VIRAL ON SOCIAL MEDIA HE DRINK AND DANCE WITH EMPLOYEES NGS VZM

Andhra Pradesh: ప్రభుత్వ కార్యాలయంలో రగులుతోంది మొగలి పొద.. మందేసి చిందేస్తున్న అధికారి

ప్రభుత్వ కార్యాలయంలో మందు చిందు

ప్రభుత్వ కార్యాలయంలో మందు చిందు

ఆయన ఓ ఉన్నతాధికారి.. కార్యాలయంలో ఉన్న సిబ్బందితో సక్రమంగా పని చేయించడం.. ప్రజా సమస్యలపై ఫోకస్ చేసేలా చేయడం అతని బాధ్యత కానీ.. ఆయన ఏం చేస్తున్నారంటే మందేసి చిందేస్తున్నారు. ఆయన ఆ పని చేయడమే కాదు.. తోటి సిబ్బందిని కూడా బలవంత పెడుతున్నారు..

ఇంకా చదవండి ...
    P. Bhanu Prasad, Correspondent, Vizianagaram, news18

    ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజా సమస్యలు తీర్చేందుకు నిలయాలుగా ఉండాలి.. కానీ కొంత మంది అధికారులు మాత్రం ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇష్టాను సారం వ్యవహరిస్తుంటారు.. లేదా లంచాలు డిమాండ్ చేస్తారు. ఇలాంటి అధికారులు సిబ్బందిని చాలామందినే చూస్తుంటాం.. మరికొంత మంది అధికారుల తీరే వేరు.. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి.. ప్రభుత్వ కార్యలయాన్ని పబ్ గా మార్చేశారు. ఆయన కాదు.. తోటి సిబ్బందిని కూడా ఎంజాయ్ చేయాలి అంటూ ప్రోత్సహిస్తున్నాడు. గరుగుబిల్లి ఎంపీడీవోగా బాధ్యతలు చేపడుతున్న ఆయన.. తన కార్యాలయంలోనే మందు, చిందుతో రెచ్చిపోతున్నాడు. రగులుతోంది మొగలి పొద అంటూ రెచ్చిపోయి డాన్సులతో హడావుడి చేస్తున్నాడు. తను తాగి మందు చిందులతో రెచ్చిపోవడమే కాక తన తోటి సిబ్బందికి కూడా మందు తాగించడం, చిందుల్లో మునిగి తేలేలా చేయడం వంటి అసభ్యకరమైన కార్యక్రమాలకు ఎంపీడీవో ఆఫీస్ ను వాడుకుంటున్నాడు. ఎదో అకేషన్ ఉన్నప్పుడు పార్టీలు చేసుకోవడం కాదు.. ప్రతి రోజూ మత్తులో తూగుతూనే ఉన్నారు.

    ప్రభుత్వ కార్యాలయాలంటే అధికారులకు లెక్క లేదు అనడానికి ఈ అధికారి తీరే నిదర్శనం. ప్రభుత్వం కేటాయించిన కార్యాలయాలను తమ ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. మందు చుక్క గొంతులో పడిదంటే.. తానే రాజు తానే మంత్రి అన్న రేంజులో రెచ్చిపోతున్నారు. బయటకు మాత్రం చాలా అమాయకంగా కనిపిస్తున్నారు గరుగుబిల్లి మండల ఎంపీడీవో రామచంద్ర రావు. ఒక మండలానికి డెవలప్మెంట్ ఆఫిసర్ గా విధులు నిర్వర్తిస్తున్న రామచంద్రారావు, సిబ్బందితో కలసి తమ హోదాను, వయసును మర్చిపోయి, ఎలా వికృత చేష్టలు చేస్తున్నారు..

    నిత్యం మధ్యం మత్తులో ఉండే ఎంపిడిఓ రామచంద్రరావు తమ కార్యాలయాన్ని క్లబ్ గా మార్చేశారని ఫిర్యాదులు అందినా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టలేదు. అందుకే తరచూ ఆయన ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ మండలంలో కొత్తేమి కాదు. గతంలో కూడా గరుగుబిల్లి మండల ఎంపిడిఓ కార్యాలయంలోని ఉపాధి కార్యాలయంలో ఉపాధి హామి పథకం ఉద్యోగులు మద్యం మత్తులో ఇలాగే చిందులేసి సస్పెండ్ అయ్యారు. అప్పుడు సస్పెండైన వారిలో ఏపీవో, కంప్యూటర్ ఆపరేటర్ తో పాటు ముగ్గురు టెక్నీకల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇప్పుడూ అదే కోవలో ఎంపిడిఓ రామచంద్ర రావు కూడా ఉన్నారు. ఇప్పుడు అంతకు మంచి అంటున్నారు. ఎంజాయ్ చేయడంలో తగ్గేదే లేదు అంటున్నారు.

    ఎంపీడీవో అధికారి తీరుతో విసిగిపోయిన కొంతమంది సిబ్బంది ఆయన వీడియోలు తీసి వైరల్ చేసారు. దీంతో ఎంపీడీవో రామచంద్ర రావు బండారం బయటపడింది. ఇది కాస్తా వైరల్ గా మారడంతో ఎంపీడీఓ రామచంద్రరావు వికృత చేష్టలు చూసి అందరూ నివ్వెరపోతున్నారు. ఎంతో భాద్యత కలిగిన ఉద్యోగంలో ఉంటూ ఇలా చిల్లర వేషాలు వేయడమేంటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మండలాన్ని డెవలప్ చేయవలసిన అధికారే ఇలా ప్రవర్తిస్తుంటే.. మండలాన్ని ఇంకేం అభివృద్ది చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఎంపిడీఓ రామచంద్రరావుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Vizianagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు