Family suicide : తెలంగాణలో మరో కుటుంబం ఆత్మహత్య.. ఒకరు ఫ్యాన్‌కు మరో ఇద్దరు..
family suicide
Family suicide : తెలంగాణలో మరో కుటుంబం ( Family suicide ) ఆత్మహత్య చేసుకుంది. ఏడు సంవత్సరాల కొడుకుతో పాటు తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇటివల కుటుంబాలకు కుటుంబాలే ఆత్మహత్యలకు పాల్పడడం విషాదాన్ని నింపుతోంది... ఈ క్రమంలోనే ఖమ్మంలో వనమా వేధింపులకు తట్టులేలక పోవడంతో పాటు చేసిన అప్పులతో ఇద్దరు పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగిన కొద్ది రోజులకే అప్పుల వాళ్ల వేధింపులతో నల్గొండకు చెందిన మరో కుటుంబం విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నారు.
ఇక తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ కుటుంబం అనుమానస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని వందనపురిలో నివసిస్తున్న .... శ్రీకాంత్ గౌడ్.(42) ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా భార్య. .అనామిక. (40) కూతురు... శ్రీ స్నిగ్ద (7) ఇద్దరు విషం సేవించి మంచంపై నిద్రావస్థలోనే మృతిచెందారు. అయితే వీళ్లు రెండు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనామిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం తెలపడంతో పోలీసులు వచ్చి తలుపులు తెరచి చూశారు. అయితే వారి మరణానికి ఏ కారణాలు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.