Home /News /crime /

ONE MIGRANT LABOURER FROM BIHAR KILLED 2 OTHERS INJURED AFTER TERRORISTS THROW GRENADE IN PULWAMA PAH

మరోసారి పుల్వామాపై గ్రెనెడ్ తో దాడులు.. ఒకరు దుర్మరణం.. మరో ఇద్దరు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jammu: ఉగ్రవాదులు మరోసారి తమ పుల్వామాపై గ్రెనెడ్ తో బాంబు దాడులకు పాల్పడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Jammu and Kashmir, India
మన దేశం మరికొద్ది రోజుల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులు, షాకింగ్ ఘటనలు తీవ్ర దుమారం రెకెత్తిస్తున్నాయి. ఇప్పటికే.. ఢిల్లీలో రద్దీ ప్రాంతంలో టిఫిన్ బాక్స్ కన్పించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదే విధంగా, పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్ లోని (Jammu kashmir)  పుల్వామాలో (Pulwama)  ఉగ్రవాదులు గ్రానెడ్ తో దాడిచేశారు.

గదూర అనే ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో.. బీహర్ కు చెందిన కార్మికులు చనిపోగా, మరో ఇద్దరు నిందితులు సీరియస్ గా గాయపడ్డారు. అయితే.. చనిపోయిన వ్యక్తి బీహర్ కు చెందిన మహ్మద్ ముంతాజ్ కాగా, తీవ్రంగా గాయపడిన వారు. మహ్మద్ ఆరిఫ్, మజ్బూల్ లు గా అధికారులు గుర్తించారు. వీరంతా వలస కూలీలని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.



ఇదిలా ఉండగా గతంలో ఒక వ్యక్తి పైలేట్ అని అనేక మందిని మోసం చేశాడు.

పూర్తి వివరాలు.. హర్యానాలోని (Haryana) గురుగ్రామ్ లో షాకింగ్ ఘటన జరిగింది. హేమంత్ శర్మ అనే 25 ఏళ్ల కుర్రాడు వందల మంది అమ్మాయిలకు, మహళలకు ఫేస్ బుక్ ,ఇన్ స్టాలో రిక్వెస్ట్ లు పెట్టాడు. కొందరు అతడి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్స్ ప్ట్ చేశారు. అయితే.. అతగాడు తాను ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం చేస్తున్నానని వారిని నమ్మించాడు. అంతే కాకుండా విదేశాలలో అనేక వ్యాపారాలు ఉన్నట్లు అమ్మాయిలకు మాయమాటలు చెప్పాడు. కొంత మంది ఇతగాడి ట్రాప్ లో పడ్డారు. అయితే.. అతను గురుగ్రామ్ కు చెందిన యువతికి కూడా ఇలాగే ట్రాప్ చేశాడు. ఆమె దగ్గర నుంచి 1 లక్షకు పైగా డబ్బులు తీసుకున్నాడు. ఆమెకు అనుమానం వచ్చి.. ఆరా తీయగా మోసగాడని బయటపడింది. దీంతో అతను.. వెంటనే పారిపోయాడు.

ఈ క్రమంలో.. యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు అతడిపై విచారణ చేపట్టారు. నిందితుడు.. హేమంత్ ను ఢిల్లీ శివారులో అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లు, సిమ్ కార్డులు, స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో ఇప్పటి దాక.. 150 మంది మహిళలకు ఇన్ స్టాలో రిక్వెస్ట్ లు పెట్టాడు. అంతే కాకుండా.. మరో 30 మందితో డేటింగ్ లో ఉన్నట్లు తెలింది. దీంతో పోలీసుల అకౌంట్ లన్నింటికి డిలీట్ చేయించారు. పైలేట్ అని చెప్పుకుంటూ.. అవతలి వారిని మోసం చేసేవాడని పోలీసుల విచారణలో తెలింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Jammu, Pulwama Terror Attack

తదుపరి వార్తలు