మావోయిస్టులపై గ్రామస్తుల రాళ్లదాడి... ఒకరు మృతి

మావోయిస్టుల‌పై గ్రామ‌స్థులు దాడి చేయ‌డంతో ఈ సంఘ‌ట‌న‌లో ఒక మావోయిస్టు మృతిచెంద‌గా, మ‌రొక మావోయిస్టుకు తీవ్ర‌గాయాల‌య్యాయి.

news18-telugu
Updated: January 26, 2020, 9:33 PM IST
మావోయిస్టులపై గ్రామస్తుల రాళ్లదాడి... ఒకరు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రా-ఒడిశా ప‌రిధిలో మావోయిస్టుల‌ను గ్రామస్తులు ప్ర‌తిఘ‌టించారు. మావోయిస్టుల‌పై గ్రామ‌స్థులు దాడి చేయ‌డంతో ఈ సంఘ‌ట‌న‌లో ఒక మావోయిస్టు మృతిచెంద‌గా, మ‌రొక మావోయిస్టుకు తీవ్ర‌గాయాల‌య్యాయి. దీనికి సంబందించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లోని చిత్ర‌కొండ బ్లాక్ ప‌రిధిలోని జొడొంబో పంచాయ‌తీ జంతురాయ్ గ్రామానికి శ‌నివారం రాత్రి స‌మ‌యంలో ముగ్గురు సాయుధ మావోయిస్టులు వ‌చ్చారు. గ్రామానికి చెందిన ఒక గిరిజ‌నుడ్ని త‌మ‌తోబాటు తీసుకెళ్లడానికి ప్ర‌య‌త్నించారు. ఈ ప్ర‌య‌త్నాన్ని గ్రామ‌స్థులు అడ్డుకున్నారు. ఈ స‌మ‌యంలో మావోయిస్టుల‌కు గ్రామ‌స్తుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. దీంతో మావోయిస్టుల‌పై గ్రామ‌స్థులు రాళ్లు దాడి జ‌ర‌ప‌గా ఒక మావోయిస్టు అక్క‌డ నుంచి ప‌రార‌య్యాడు. మిగ‌తా వారిలో ఒక‌రు సంఘ‌ట‌నాస్థ‌లంలో మృతిచెంద‌గా, మ‌రొక‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన మావోయిస్టును మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు