Home /News /crime /

Andhra Pradesh: పెంపుడు కుక్క మొరిగిందని.. ఓ బాటసారి ఎంతపని చేసాడంటే..?

Andhra Pradesh: పెంపుడు కుక్క మొరిగిందని.. ఓ బాటసారి ఎంతపని చేసాడంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెంపుడు కుక్క మొరిగితే ఎవరైనా ఏం చేస్తారు.. సైలెంట్ గా పక్క నుంచి వెళ్లిపోతారు.. లేదా ఆ ఇంటిలో వాళ్లని పిలిచి అరవకుండా చూడమంటారు.. కానీ చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి మాత్రం ఎవ్వరూ ఊహించని పని చేశాడు. అలాగని కుక్కను మాత్రం ఏం చేయలేదు.. ఇంతకీ అతడు ఏం చేశాడో తెలుసా..?

ఇంకా చదవండి ...
  పెంపుడు కుక్కలంటే చాల మంది ప్రాణంగా భావిస్తారు. కుక్కని పేరు పెట్టి తప్ప వేరొక విధంగా పిలిచినా ఒప్పుకోరు కొందరు. ఎంతో ప్రేమగా చూసుకునే కుక్కను పెరట్లో వదిలిపెస్తుంటారు. ఇంటి గుమ్మం,  పెరట్లో ఉన్న కుక్కలు వచ్చి,  పోయే వ్యక్తులను చూసి గ్రామసింహాలు గర్జిస్తూ ఉంటాయి.  ముఖ్యంగా కొత్త వ్యక్తులు ఇంటి వైపు వస్తున్నపుడు కుక్కలు అరవడం సర్వ సాధారణం. కొందరు వాటి అరుపులకు బయపడుతారు.. మరి కొందరు అవి మొరిగిన అవేం పట్టించుకోకుండా దైర్యంగా ముందుకు సాగుతారు. కానీ కళ్యాణదుర్గం ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ నివ్వెర పోయారు. కుక్క తనని చూసి అరిస్తే ఇంతపని చేస్తారా అంటూ నోరెళ్ళ బెట్టారు.

  కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనేల వీధిలో సుధాకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. తనకు ఎంతో ఇష్టమైన కుక్కను ఇంటి పెరట్లో వదిలిపెట్టారు.  గేటుకు అవతలివైపు వెళ్తున్న వ్యక్తులను చూస్తూ మొరుగుతూ ఉండేది. అందరూ పెద్దగా పట్టించుకొనే వారు కాదు. కానీ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న జహీర్ రోజు అటుగా వెళ్తూ వచ్చేవాడు. రోజు అటువైప్పుగా వెళ్లే ఆ బాటసారికి మాత్రం విపరీతంగా కోపం వచ్చేది.  అయినా నెల రోజుల పాటు సహించాడు... రోజు రోజుకు ఆ కుక్క మురుగుతూ ఉండటంతో అతనికి బాగా కోపం వచ్చింది.

  ఇదీ చదవండి: మనవరాలినే కిడ్నాప్ చేయించిన అమ్మమ్మ.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

  రెండు మూడు సార్లు యజమాని సుధాకర్ తో గొడవకు దిగాడు. కుక్కను అదుపులో పెట్టుకోకపోతే ....తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు. కానీ ఆ కుక్క తనను చూసి మొరుగుతుంది అనే నెపంతో చిన్న... కొలిమిలో కోడవలిని వెంట తెచ్చుకున్నాడు. కుక్క మళ్లీ మొరిగితే దాడి చేయాలనీ చూసాడు. కానీ ఆ కుక్క యజమాని సుధాకర్ ఇంటి గుమ్మం దగ్గరే ఉన్నాడు. అయినా కుక్క మొరగడంతో యజమాని సుధాకర్ తో జహీర్... వాదనకు దిగారు. ఇద్దరిమధ్య వాదనలు తారాస్థాయికి చేరడంతో వెంట తెచ్చుకున్న కొడవలితో దాడికి తెగబడ్డాడు జహీర్.  తీవ్ర రక్త స్రావం కావడం గుర్తించిన కుటుంబ సభ్యులు 108 సహాయంతో అనంత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుధాకర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. బాధితుల పిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసిన పోలీసులు.... జహీర్ ను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. క్షణిక ఆవేశంలో ఎదుటి వారిపై చేసిన దాడితో కటకటాల పాలయ్యాడు జహీర్.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Dog, Tirupati

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు