హోమ్ /వార్తలు /క్రైమ్ /

Viral video: పాములకు రాఖీ కట్టాడు.. ఆ తరువాత ఏం జరిగిందో వీడియో చూడండి..

Viral video: పాములకు రాఖీ కట్టాడు.. ఆ తరువాత ఏం జరిగిందో వీడియో చూడండి..

పాములకు రాఖీ కట్టాడు. కానీ తరువాత  మరణించాడు

పాములకు రాఖీ కట్టాడు. కానీ తరువాత మరణించాడు

ప్రేమగా రెండు పాములను చేరదీశాడు.. తనతో పాటు.. తన చెల్లెళ్లతో వాటికి రాఖీ కట్టించాడు.. అంత వరకు బాగానే అంతా సాగింది. కానీ కాసేపటికే ఊహించని ఘటనతో ఆ వేడుకను చూస్తున్నావరంతా షాక్ అయ్యారు.

Snake Rakhi: ఒక్కొక్కరికీ ఒక్కో ఫ్యాషన్ ఉంటుంది.. తమ సరదాలు తీర్చుకోవడానికి సహాసాలు చేస్తారు. అది కూడా రాఖీ పండుగ రోజు.. తన చెల్లెళ్లతో రాఖీ కట్టించుకోవాల్సిన అన్న.. పాములకు రాఖీ కట్టాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అదే విషయం అందిరికీ చెప్పడంతో.. స్థానికులు సైతం ఆ రాఖీ వేడుకను కళ్లారా తిలకించాలి అనుకున్నారు. అతడు చెప్పినట్టే రెండు పాములకు రాఖీ కట్టాడు. అది కూడా ఓ చెల్లి అన్నకు ఎలా రాఖీ కుడుతుందో అలా సంప్రదాయం బద్ధంగా రెండు పాములకు రాఖీ కట్టాడు. అంతా ముచ్చట పడి ఆ సన్నివేశం మొత్తం వీడియోల్లో రికార్డు చేశారు. జనం సందడి మధ్య రాఖీ తతంగాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత తన చెల్లెళ్లతోనూ వాటికి రాఖీ కట్టించే ప్రయత్నం చేశాడు. అంత వరకు అతడు అనుకున్నట్టే జరిగింది. అది చూస్తున్నవారంతా కూడా ఎంజాయ్ చేశారు. పాములను పట్టడంలో నేర్పరి అయిన మన్మోహన్ అనే వ్యక్తి అనుకున్న ప్రకారం రెండు పాములను చాకచక్యంగా పట్టుకుని.. వాటికి బొట్టులు పెట్టి రాఖీ కట్టాడు. అప్పటి వరకు ఆ రెండు పాములను తన కంట్రోల్ పెట్టాడు. కానీ రాఖీ కడుతున్న సమయంలో పాముల కదలికను అతడు గమనించలేదు.. దీంతో అనుకోకుండా కథ అడ్డం తిరిగింది. బీహార్‌లోని సారణ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా రాఖీ పండగ వేడుకలు సందడిగానే సాగాయి. ఈ సందర్భంగా పాములు పట్టే 25ఏళ్ల మన్మోహన్ రెండు పాములకు రాఖీ కట్టాడు. ఆ తర్వాత తన చెల్లెళ్లతోనూ పాములకు రాఖీలు కట్టించేందుకు ప్రయత్నించాడు. దీని కోసం రెండు పాముల తోకలను పట్టుకున్నాడు. వారితో రాఖీ కట్టించే పనిలో అతడు మునిగిపోయడు. ఇంతలో ఒక పాము మెల్లగా పాకుతూ ఏమరుపాటుగా ఉన్న అతడి పాదం వేలిపై కాటు వేసింది. దీంతో మన్మోహన్ ఉలిక్కిపడి లేచాడు.

పాములు పట్టే వ్యక్తిగా తనకు ఏం కాదు.. ఇలాంటి చాలాసార్లు జరిగాయి అని లైట్ తీసుకున్నాడు. అందుకే ఆసుపత్రికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేశాడు. ఆ కాసేపటికే అతడు మరణించాడు. మన్మోహన్ పాములకు రాఖీ కట్టే దృశ్యాన్ని చూసేందుకు అక్కడికి చాలామందే వచ్చారు. కొందరు దీన్ని మొబైల్ లో వీడియో తీశారు. ఇప్పుడా వీయోడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. http://


మన్మోహన్ ప్రకృతి ప్రేమికుడు. గత పదేళ్లుగా ఇళ్లలోకి ప్రవేశించే పాములను పట్టి వాటిని సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టేవాడు. గాయపడిన పాములకు చికిత్స కూడా చేసేవాడు. పాము కాటుకు గురైన వందలాది స్థానికులు, పరిసర గ్రామస్తులకు చికిత్స అందించాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పాము కాటు కారణంగా చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది.

First published:

Tags: Bihar, India news, National News, Raksha Bandhan, Snake bite, Snakes

ఉత్తమ కథలు