• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • ONE MAN THREATENING PASSENGERS WITH GUN IN BUS SRIKAKULAM DISTRICT VZM NGS

Andhra Pradesh: జాతీయ రహదారిపై గన్ తో ఓ వ్యక్తి. భయంతో పరుగులు తీసిన జనం. చివరికేమైంది. వీడియోలో చూడండి

శ్రీకాకుళం జిల్లాలో తుపాకీతో బెదిరింపు

జాతీయ రహదారిపై తుపాకీతో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ఓ టీకొట్టు యజమానితో పాటు బస్సులో తోటి ప్రయాణికులను బెదిరించాడు. అటువైపు వెళ్తున్న లారీ డ్రైవర్లు సాహసం చేసి అతడ్ని పట్టుకోవడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు. అయితే ఆ తుపాకీని చూసిన పోలీసులు మాత్రం షాక్ కు గురయ్యారు.

  • Share this:
    ఇటీవల ఉత్రాంధ్రలో గన్ కల్చర్ పెరిగిపోయింది. తుపాకీలు పట్టుకుని తిరుగుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది. ఇటీవల విజయనరం జిల్లాలో ఓ ఆర్మీ  జవాను తుపాకీ పట్టుకుని ఓ బంగారం వ్యాపారిని బెదించాడు. ఆ ఘటన మరచిపోకముందే నిన్న విశాఖపట్నంలో నిత్య పెళ్లికొడుకు.. తొమ్మిది మందిని పెళ్లిల్లి చేసుకుని వ్యభిచారం చేయమని బెదిరించిన అరుణ్ కుమార్ తుపాకీతో దిగిన ఫోటోలు హల్ చల్ చేశాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారిపై ఓ వ్యక్తి తుపాకీ చేతట్టుకుని వీరంగం సృష్టించాడు.

    ఒడిశా రాష్ట్రం జయపూర్ నుంచి బరంపురం వెళ్తున్న బస్సులో తోటి వారితో కలిసి ప్రయాణం చేస్తూ వచ్చాడు ప్రదీప్. మొదట బస్సులో అందరి ప్రయాణికుల్లానే బుద్ధిగా కూర్చొని ప్రదీప్ ప్రయాణం చేశాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. అయితే ప్రయాణ సమయంలో మధ్యలో కొర్లాం దగ్గర బస్సును ఆపారు. ప్రయాణికులు అంతా టీ తాగేందుకని బస్సును ఆపారు. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ప్రదీప్ స్వైన్.. ఆ సమయంలో తనతో తెచ్చుకున్న నాటు తుపాకీని బయకు తీశాడు. దాన్ని చూపిస్తూ టీ షాపు యజమానిని, ఇతర ప్రయాణీకులను బెదిరించాడు. చేతిలో తుపాకీ ఉండడంతో హాటల్ యజమానితో సాహా ఇతర ప్రయాణికులు బెంబెలెత్తిపోయారు.

    తుపాకీలో బుల్లెట్లుండడంతో ఏమి చేస్తాడోనంటూ కొద్దిసేపు వరకు భయంతో పరుగులు తీశారు. చివరకు అటవైపుగా వస్తున్న లారీ డ్రైవర్లు కొందరు సాహసం చేసి.. ప్రదీప్ స్వైన్ ను పట్టుకున్నారు. చేతిలో తుపాకీ తీసుకుని.. దేహశుద్ధి చేశారు. స్థానికుల సహాకారంతో బారువ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రదీప్ స్వైన్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి దగ్గర ఉన్నది కేవలం డమ్మీ తుపాకి అని తెలిసి షాక్ కు గురయ్యారు. కేవలం డమ్మీ తుపాకీ పట్టుకుని అంతమందిన ఎలా బెదిరించాడని వాపోయారు. స్థానికుల దగ్గర నుంచి ఏం జరిగింది అన్నదానిపై సమాచారం తీసుకున్నారు.

    అయితే పోలీసులు ఘటనా స్థలానికి రాక ముందు ప్రదీప్ స్వైన్ ను అక్కడే ఉన్న లారీ డ్రైవర్లు పట్టుకొనేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి దగ్గర నుంచి ప్రదీప్ తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే లారీ డ్రైవర్లు, స్థానికులు వెంబండించి అతడ్ని పట్టుకున్నారు. దీంతో ఈ పెనుగలాటలో ప్రదీప్ స్వైన్  తలకు స్వల్ప గాయాలు అయ్యాయి.  డమ్మీ తుపాకీతో బెదిరించి ప్రదీప్ ఎక్కడ నుంచి వస్తున్నాడు.  ఎందుకు తుపాకీ వెంట తెచ్చుకున్నాడు. గతంలో నేరాలకు పాల్పడ్డాడా? అన్న కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: