ONE MAN KILLED BY MOIST IN VISAKHAPATNAM DISTRICT SUSPECTED POLICE INFORMER NGS
Andhra Pradesh: విశాఖ మన్యంలో మావోల పంజా.. ఇన్ఫార్మర్ అనే అనుమానంతో గిరిజనుడి దారుణ హత్య
ప్రతీకాత్మక చిత్రం
విశాఖ మన్యంలో మావోలు అలజడి భయపెడుతోంది. శుక్రవారం 20 మావోయిస్టులు గ్రామంలోకి వచ్చి ఇన్ ఫార్మర్ అనే అనుమానంతో ఒక వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా వ్యవహరించిన వారెవరికైనా ఇలాంటి గతే పడుతుందని హెచ్చరించారు.
విశాఖ జిల్లా మన్యంలోని గూడెం కొత్తవీధి మండలంలో మావోయిస్టులు పంజా విసిరారు. పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడనే అనుమానంతో గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. దీంతో విశాఖ మన్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన కొర్రా పిల్కు గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. తరువాత పోలీసుల ముందు లొంగిపోయాడు.
అప్పటి నుంచి మావోయిస్టు దళాలు అతడిపై పగ పెంచుకున్నాయి. శుక్రవారం అర్థరాత్రి సాయుధులైన మావోయిస్టులు సుమారు 20 మంది కొత్తపాలెం గ్రామానికి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న పిల్కు పై దాడిచేసారు. తాడుతో కాళ్లు చేతులు కట్టేసి అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతని భార్య మిత్తుపై దాడిచేసారు. తీవ్రంగా గాయపడిన తరువాత పిల్కు ఇంటిలో ఉన్న గొడ్డలి తీసుకుని మెడ వెనుక బాగంలో, గొంతు బాగంలో అతి దారుణంగా నరికేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నందుకే అతడ్నిహతమార్చామని మావోయిస్టులు సంఘటనాస్థలంలో లేఖ రాసి విడిచిపెట్టి వెళ్లారు.
గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న మన్యంలో మావోయిస్టులు కదలికలు పెరగడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు గిరిజనులు. మావోయిస్టులు మాత్రం తమ చర్యను సమర్ధించుకుంటున్నారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నందుకు హతమార్చామని మావోయిస్టు పార్టీ గాలికొండ ఏరియా కమిటీ సంఘటనా స్థలంలో విడిచిబెట్టిన లేఖలో పేర్కొన్నారు. గూడెం కొత్తవీధి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన కొర్రా పిల్కు మావోయిస్టు పార్టీలో పనిచేసి పార్టీకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులు ముందు లొంగిపోయి విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టారని, దళం వారి ప్రాంతంలోకి వచ్చిన వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి బారీ ఎత్తున గాలింపు చర్యలు నిర్వహించేవిధంగా పిల్కు ప్రోత్సహించేవాడని దీంతో చుట్టప్రక్కల గ్రామాలకు చెందిన గిరిజనులు పిల్కును హెచ్చరించినప్పటికీ పోలీసులు సహకారంతో గిరిజనులపై దౌర్జన్యం చేస్తున్నాడని మావోయిస్టు పార్టీ పేర్కొంది.
ఈ విషయం మావోయిస్టు పార్టీకు తెలియడంతో 2020 సెప్టెంబరులో గాలికొండ దళం పిల్కుని ప్రజాకోర్టులో పెట్టి పద్దతి మార్చుకోవాలని హెచ్చరించినట్లు మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇది జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు నిర్వహించారని, దీంతో మరోసారి మా పార్టీ సబ్యులు పిల్కును పిలిచి అడగ్గా, వెంటనే పోలీసులు మా కోసం గాలింపు చర్యలు నిర్వహించారని ఆరోపించారు. మూడోసారి 021 జనవరిలో పిల్కును పిలిపించగా, రాకపోగా, ఆ సమాచారన్ని పోలీసులకు అందించాడని మావోలు ఆరోపిస్తున్నారు. వందలమంది పోలీసులు గాలింపుచర్యల్లో ప్రజలు సహకారంతో పార్టీ తప్పించుకుందని మావోయిస్టు పార్టీ తెలిపింది. పిల్కు పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేయడమే కాకుండా గ్రామంలో ఉన్న ప్రజలను బెదిరించడం, కొట్టడం వంటి అరాచకాలకు పాల్పడుతూ ప్రజలకు నష్టం చేస్తున్నాడని, దీనిపై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాకోర్టులో పిల్కు ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని తేలడంతోనే మరణ శిక్షను విధించామంటూ లేఖలో పేర్కొన్నారు. పిల్కును విచారించిన సందర్బంలో పోలీసులకు ఇన్ఫార్మర్లగా పనిచేస్తున్న మరికొంతమంది పేర్లు కూడా చెప్పాడని.. ఇప్పటికైనా వారు పద్దతి మార్చుకోవాలని లేదంటే పిల్కుకు పట్టిన గతే పడతుందని మావోయిస్టు పార్టీ గాలికొండ ఏరియా కమిటీ హెచ్చ
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.