Visakhapatnam: ఎనిమిది మందితో ప్రేమ పెళ్లి: తరువాత వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి: మాట వినకపోతే ఏం చేస్తాడో తెలుసా?

విశాఖలో నిత్య పెళ్లి కొడుకు అరాచకాలు

విశాఖపట్నంలో ఓ నిత్య కొడుకు లీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలను నమ్మించడం.. తరువాత పెళ్లి చేసుకుని వ్యభిచార రొంపిలోకి దించుతున్నాడు. అలా ఇప్పటి వరకు 8 మందిని పెళ్లి చేసుకున్నాడు. అందులో మొదటి భార్య ఎదురు తిరగడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

  • Share this:
    ఇటీవల నిత్య పెళ్లి కొడుకుల అరాచకాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. చాలా చోట్ల రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న తరువాత.. అరాచకాలు బయటకు వస్తుంటాయి. ఇలాంటి కేసులు ఎన్నో రోజూ వింటూ ఉంటా.. కానీ విశాఖలోని ఓ నిత్య పెళ్లికొడుకు రూటే సపరేటే.. ఎంతలా అంటే ఇప్పటి వరకు అతడు ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా అన్నీ ప్రేమ వివాహాలే కావడం మరో విశేషం. సాధరణంగా ఒకటి రెండు పెళ్లిళ్ల తరువాతైనా ఇలాంటి వారి అరాచకాలు బయట పడాలి కాని.. ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నా అతడి వ్యవహారం ఎందుకు వెలుగులోకి రాలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.

    టిప్ టాప్ గా రోమియోలా రెడీ అవ్వడం.. రోడ్డుపై బలదూరుగా తిరగడం.. ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే చాలు.. మాటలు కలిపి మాయమాటలు చెబుతాడు. తనది చాలా లగ్జరీ లైఫ్ అని నమ్మిస్తాడు. తనను వివాహం చేసుకుంటే సుఖమైన జీవితం ఉందంటూ మొదట వెంటపడతాడు. వారిని నమ్మించి తనపై నమ్మకం కలిగే వరకు ప్రేమించమని ప్రాధేయపడతాడు. అతడి మాటలు నమ్మి ప్రేమించడానికి అమ్మాయి ఒప్పుకుంటే త్వరగానే పెళ్లికి అంగీకరిస్తాడు.. ఆ తరువాతే మనోడి అసలు రూపం బయటపడుతుంది.

    పెళ్లిచేసుకుంటానని అతడు నమ్మించడంతో యువతులు కూడా త్వరగానే అతడి మాటల్లో పడిపోతున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన కొందరు అమ్మాయిలను.. అలాగే రోడ్డుపై పరిచయమైన కొందరు అమ్మాయిలను మొదట బాగా నమ్మించి ప్రేమలో దించుతాడు.. వారికి పూర్తిగా నమ్మకం కలిగిన తరువాత మంచి జీవితం ఇస్తానని చెప్పి.. పెళ్లి చేసుకుంటాడు. అయితే ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు మొత్తంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు విశాఖపట్నానికి (visakhpatnam) చెందిన అరుణ్ కుమార్ (arun kumar).

    అరుణ్ కుమార్ కు వ్యభిచార ముఠాలు, గంజాయి గ్యాంగులతో సంబంధాలు ఉన్నాయి. వారికి కావాల్సిన అమ్మాయిలను, గంజాయిను సరఫారా చేస్తూ డబ్బు బాగానే సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బుతో అమ్మాయిలను వలలో వేసుకుంటాడు. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటాడు. తరువాత వ్యభిచార రొంపిలోకి దింపుంతాడు. తాజాగా తన మొదటి భార్య వ్యభిచారానికి నిరాకరించడంతో ఆమె కుమార్తెను అమ్మెస్తాను అంటూ బెధిరింపులకు దిగాడు. కేవలం ఆమెనే కాదు.. తనను నమ్మి వివాహం చేసుకున్నవారందర్నీ ఇలానే బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యభిచార ముఠా, గంజాయి గ్యాంగులతో సంబంధాలు కారణంగా మారణాయుధాలు కూడా అతడి దగ్గరే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అది కూడా సినిమాల్లో ఏవైనా మారణాయుధాలను చూస్తే..  అచ్చం అలాంటివాటినే తయారు చేయించి తన దగ్గర పెట్టుకున్నట్టు పోలీసులు గుర్తించారు.  ఎవరైతే తన మాట వినరో వారికి కత్తులు, తుపాకులను చూపించి చంపేస్తానని బెదిరిస్తున్నట్టు గుర్తించారు.

    అరుణ్ కుమార్ మొదటి భార్య ఎదురు తిరగడంతో ఈ నిత్య పెళ్లి కొడుకు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురిని అమ్మేస్తానని చెప్పడమే కాకుండా, కత్తులు, తుపాకులతో బెదిరించాడని ఆమె కంచరపాలెంలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకోకపోవడంతో ఆమె మహిళా సంఘలను ఆశ్రయించింది. అయితే బాధిత మహిళలు మాత్రం అరుణ్ కుమార్ కు పోలీసులతో స్నేహ సంబంధం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగడంతో అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి దగ్గర నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకుని.. అతడిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా అతడి బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published: