హోమ్ /వార్తలు /క్రైమ్ /

యువకుడి దారుణ హత్య.. ఓ వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలను కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటే..

యువకుడి దారుణ హత్య.. ఓ వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలను కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువకుడి దారుణ హత్య జరిగింది. ఈ హత్య కేసులో ఓ వ్యక్తితోపాటు ఇద్దరు మహిళలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ వాళ్ల మధ్య ఉన్న సంబంధం ఏంటంటే..

ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో దారుణంగా హత్య చేశారు. ఆ యువకుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు దర్యాప్తులో కొన్ని ఆసక్తికర నిజాలు తెలిశాయి. హత్యకు అసలు కారణమేంటో తెలిసింది. అంతే, విచారణను అత్యంత వేగంగా ముగించేశారు. కేసును తేల్చేశారు. నిందితులను పట్టేశారు. ఓ వ్యక్తితోపాటు మరో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలకు, ఆ వ్యక్తికి, చనిపోయిన యువకుడితో ఉన్న సంబంధమేంటనే కదా మీ డౌటు. నిజమే, ఏమాత్రం సంబంధం లేదు. కాకపోతే ఆ కుర్రాడు మంచి చేద్దామనుకుని వెళ్తే చివరకు అతడి ప్రాణమే పోయింది. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గూడురు మండలం భూపతి పేట గ్రామానికి చెందిన 27 ఏళ్ల కుందరాపు విక్రంను ఏప్రిల్ 6వ తారీఖున గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అతడి భార్య సుమలత ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త హత్యకు అసలు కారకులెవరో తేల్చాలని ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేసి ఇద్దరు మహిళలను, ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విక్రంను హత్య చేసేందుకు అసలు కారణమేంటన్నది వెల్లడించారు. భూపతిపేటకే చెందిన సంతోష్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. విక్రంకు సమీప బంధువైన ఓ మహిళతో సంతోష్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

వీరిద్దరి వివాహేతర సంబంధానికి రేణుక అనే మహిళ సహాయం చేస్తుంటుంది. అయితే తన బంధువుతో వివాహేతర సంబంధం మానుకోవాలనీ, ఆమె కుటుంబాన్ని, సంసారాన్ని నాశనం చేయొద్దంటూ విక్రం హితవు పలికాడు. ఇటీవల అందరి ముందు ఈ విషయమై సంతోష్ ను నిలదీశాడు. దీంతో పరువు పోయినట్టు ఫీలయిపోయిన సంతోష్, రేణుక, వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కలిసి విక్రంను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఏప్రిల్ ఆరో తారీఖున రేణుక ఓ ఇనుప రాడ్డును ఇచ్చింది. దాన్ని తీసుకుని వెళ్లిన సంతోష్ బైక్ పై వెళ్లి భూపతి పేట ప్రభుత్వ పాఠశాల దగ్గర్లో ఉన్న విక్రం తలపై గట్టిగా కొట్టాడు. అతడు ఇంకా బతికే ఉన్నాడని గుర్తించి ఓ బండరాయితో తలపై మోదాడు. దీంతో విక్రం అక్కడిక్కడే మృతి చెందాడు. భర్తను ఎవరు చంపారో తేల్చాలంటూ పోలీసులకు విక్రం భార్య సుమలత ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు కారణమైన ఇద్దరు మహిళలను, సంతోష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: ప్రియుడితో తల్లి ఎస్కేప్.. తండ్రి బాధను చూడలేక.. పదేళ్ల తర్వాత కన్న కొడుకే పనోడిలా చేరి ఇలా పగతీర్చుకున్నాడు..!

First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Wife kill husband

ఉత్తమ కథలు