Vijayawada: విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం.. రోడ్డుపైనే పరస్పరం దాడులు.. ఒకరి మృతి

ప్రతీకాత్మక చిత్రం

Vijayawada: నిందితులు దాడికి ఉపయోగించిన బ్లేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల కోసం అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

  • Share this:
    విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ మరోసారి వీరంగం సృష్టించింది. సింగ్‌నగర్ పైపుల రోడ్డులో నలుగురు యువకులు బ్లేడ్లలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. మద్యం మత్తులో వారంతా ఇలా చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. ఈ దాడిలో ఒకరు చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని పండుగా గుర్తించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. నిందితులు దాడికి ఉపయోగించిన బ్లేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల కోసం అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ దాడికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఓ వ్యక్తి చనిపోవడం.. మిగతా ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడటంతో.. వారు కోలుకున్న తరువాతే ఈ గొడవకు అసలు కారణం తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

    అయితే పరస్సరం దాడులకు పాల్పడింది సెంట్రింగ్ కార్మికులు అనే వాదన కూడా వినిపిస్తోంది. తమ మధ్య ఘర్షణ తలెత్తడంతో సెంట్రింగ్ కార్మికులు గొడవపడ్డారని.. మద్యం మత్తులో వంద రూపాయల కోసం కార్మికులు కొట్టుకున్నారని తెలుస్తోంది. ఈ దాడిలో వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ కార్మికుడు పండు మృతి చెందాడు. ముగ్గురికి గాయాలయ్యాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: