news18-telugu
Updated: February 24, 2020, 3:33 PM IST
ప్రతీకాత్మక చిత్రం
విజయవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. భవానీపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వెళ్లి పలు వాహనాల్ని ఢీకొని ముందుకు దూసుకెళ్లిపోయింది. ఆ తర్వాత ఓ అపార్ట్ మెంట్ గోడను ఢీకొని ఆగింది. ఈ ఘటనలో ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కారు ప్రమాదాలు జనాల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వరుస కారు ప్రమాదాలతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పలువురు మద్యం మత్తులో వాహనాల్ని నడుపుతూ.... అనేకమంది అమయాకుల ప్రాణాలు బలితీసుకుంటున్నారు. మరికొందరు డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
February 24, 2020, 3:30 PM IST