Home /News /crime /

ONE HUSBAND HARASSED HIS WIFE FOR BABY BOY 8 OPERATIONS AND 1500 INJUNCTIONS SHE FILE POLICE COMPLIANT NGS

Husband Harassment: 8 అబార్షన్లు, 1,500 ఇంజెక్షన్లు.. మగ బిడ్డ కోసం భర్త చిత్రహింసలు.. చివరికి ఏం చేసిందంటే?

మగ బిడ్డ కోసం భర్త చిత్ర హింసలు

మగ బిడ్డ కోసం భర్త చిత్ర హింసలు

సాంకేతికంగా ముందుకు వెళ్తున్నా.. ఇంకా కొందరు మూర్ఖంగానే ఉంటున్నారు. ఆడ పిల్ల వద్దు.. మగ బిడ్డ కావాలి అంటూ భార్యలను చిత్ర హింసలు పెడుతున్నారు. ఉన్నత విద్యావంతుడైన ఓ భర్త.. తన భార్యకు తెలియకుండానే 8సార్లు అబార్షన్లు చేయించాడు. ఎక్కడో తెలుసా?

ఇంకా చదవండి ...
  ఆడపిల్ల పుట్టింది అంటే మహాలక్ష్మిగా భావించాలి.. ఇప్పటికే చాలామంది ఇంటిలో ఆడపిల్ల పుట్టింది అంటే పండుగ చేసుకుంటారు. అయినా కొందరు మాత్రం ఈ మూర్ఖత్వాన్ని వీడడం లేదు. దేశం ఇంతగా అభివృద్ధి చెందింది. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నాం. ఇక ఒకప్పటిలా అమ్మాయి- అబ్బాయిలు అని తేడానే లేదు. అన్ని రంగాల్లో అమ్మాయిలదే పైచేయి అవుతోంది. అబ్బాయిల కంటే అమ్మాయిలే అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడు రాణిస్తారు. వారికి అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇలాంటి రోజుల్లో కూడా కొందరు తమకు అబ్బాయే పుట్టాలని.. అమ్మాయి వద్దూ అంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా ఇంకా ఆడపిల్ల, మగ పిల్లాడు అనే తేడా మారడం లేదు. మహిళలను మగ పిల్లడు కనడేనికే పెళ్లి చేసుకున్నాం అన్నట్టు కొందరు వ్యవహరిస్తున్నారు. వారిని పిల్లల్ని కనే మెషిన్లుగానే పరిగణిస్తున్నారు కొందరు కిరాతకులు. ఇప్పటికే చాలా చోట్ల ఇంకా మగ పిల్లాడి కోసం భ్రూణ హత్యలకు పాల్పడుతున్న వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అంటే వారిని ఏమనాలి. తాజాగా మరో దారుణం ముంబైలో వెలుగులోకి వచ్చింది. ముంబైలోని దాదర్ లో ఓ భర్త అరచకాలు విని అంతా షాక్ కు గురవుతున్నారు. ఓ 40 ఏళ్ల మహిళ తన భర్త కోరిక కారణంగా.. ఎనిమిది సార్లు గర్భస్రావం చేయించుకోవాల్సి వచ్చింది. అదీ కూడా ఆమెకు కారణం ఏంటో తెలియకుండా అంటే.. ఆ భర్త తెలివితేటలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు...

  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు చెప్పిన వివారాల ప్రకారం. ఆ బాధితన మహిళకు పెళ్ళి 2017లో జరిగింది. ఉన్నత విద్యావంతులైన కుటుంబానికి ఆమెను ఇచ్చి వివాహం చేశారు ఆమె తల్లి దండ్రులు. తన భర్త, అత్త న్యాయవాదులు, వాళ్ళ కూతురు డాక్టర్ అలాంటి కుటుంబానికి వెళ్లాలని ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రి ఆశ పడతాడు. ఆమె విషయంలోనూ అదే జరిగింది. అయితే కొన్నాళ్లు ఆమెను బాగానే చూసుకున్న భర్త.. ఆడ పిల్ల పుట్టిన తరువాత నుంచి టార్చర్ చేయడం మొదలు పెట్టినట్టు తెలిసింది.

  తన ఆస్తిని కాపాడటానికి ఒక కొడుకు కావాలని భార్యతో ఆ భర్త ప్రతిరోజూ చెప్పేవాడు. అందుకోసం తనను భర్త శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొడుకు పుట్టాలని కోరికతో విదేశాల్లో ఎనిమిది సార్లు అబార్షన్ చేయాల్సి వచ్చిందని బాధితురాలు తెలిపింది. ఆమె 2009లో ఒక అమ్మాయికి జన్మనిచ్చిందని, 2011లో ఆమె మళ్లీ గర్భవతి అయ్యింది. అయితే అప్పుడే తన భర్త ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లి అబార్షన్ చేయించుకోమని బలవంతం చేశాడంట.. కానీ ఎందుకో ఆమె తెలియదు బిడ్డ కు ఏదో సమస్య ఉందనుకుని ఆబార్షన్ కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదంతా చేసింది కొడుకు పుట్టడం కోసం అని చాలా ఆలస్యంగా తెలుసుకుంది. నిందితుడు ప్రీ-ఇంప్లాంటేషన్ జన్యు నిర్ధారణ కోసం మహిళను బ్యాంకాక్ తీసుకువెళ్లాడు. 40 ఏళ్ళ ఆమె తనకు తెలియకుండానే అక్కడ గర్భధారణకు ముందు పిండం లింగాన్ని అంటే మగపిల్లాడా లేదా ఆడపిల్లా ? అనే పరీక్ష చేయించుకుంది. అంతేకాదు మగబిడ్డ కోసం చికిత్స, శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. మగబిడ్డకు జన్మనివ్వాలని ఆ మహిళకు దాదాపు 1,500 హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చారట. ఇలాంటి పరీక్ష, చికిత్సలు భారతదేశంలో నిషేధించారు.తన అంగీకారం లేకుండానే ఈ చికిత్స జరిగిందని, తన జీవిత భాగస్వామి తన బిడ్డను ఎనిమిది సార్లు అబార్షన్ చేయమని ఒత్తిడి చేశారని బాధితురాలు చెప్పింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Crime news, Husband harassment, India news, National News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు