ONE GIRL CHEATED BY FACE BOOK UNKNOWN FRIEND AFTER FRIENDSHIP HE BLACKMAILED PRESENT GIRL WAS PREGNANT NGS TPT
Andhra Pradesh: అతడికి 26, ఆమెకు 17.. పరిచయం లేకున్న ప్రేమించుకున్నారు.. కానీ చివరికి
face book love teenage girl
అతడి వయసు 27.. ఆమె వయసు 17.. ఫేస్ బుక్ లో ప్రొఫైల్ చూశాడు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు.. హాయ్ అంటూ తన గురించి గొప్పలు చెప్పుకున్నాడు.. యువతిని ఆకర్షించాడు.. కానీ ఆ తరువాత అసలు ట్విస్ట్ ఇచ్చాడు..
GT Hemanth Kumar, Tirupati Correspondent, News18 నువ్వు కావాలి అన్నాడు.. నీ నవ్వే చాలన్నాడు.. నువ్వు లేనిదే నేను లేనన్నాడు.. ప్రేమిస్తున్నాను.. ప్రాణమిస్తాను అంటూ మెసేజ్ లు పెట్టాడు.. ఇంతలా ప్రేమించిన వ్యక్తిని కాదంటే ఎలా అనుకుంది ఓ టీనేజ్ యువతి.. ప్రేమంటే ఇదేనేమో అనుకుంది. అతడితో మాటా మాటా కలిపింది. మనసు ఇచ్చింది. నీకు పది హేడు.. నాకు 26 అంటూ.. ఆమెను మాటలతోనే మత్తిక్కించేలా చేశాడు. అతడి లేనిదే జీవితం లేదనుకునేలా చేశాడు. అలా వారి ప్రేమ మూడు ముద్దులు.. ఆరు హగ్గులు అంటూ హ్యాపీగా సాగింది. ఆ తారువాత అతడిలో మన్మధుడిని బయట పెట్టాడు. లైంగిక కోరికలు తీర్చకుంటే చనిపోతాను అంటూ బెదిరించాడు. సరే పెళ్లి చేసుకుంటాడు కదా అనే నమ్మకంతో అతడు అడిగిన దానికి నో చెప్పలేకపోయింది.. ఇలా చాలాసార్లు తన కోర్కెలు తీర్చుకున్నాడు. తరువాత మొహం చాటేశాడు.
మదనపల్లె ఎన్వీఆర్ లేఅవుట్ కు చెందిన ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న 26 ఏళ్ల దినేష్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా అదే మండలంలోని నక్కలదిన్నెకు చెందిన 17 ఏళ్ల బాలికకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. అదే జిల్లాకు చెందిన వాడు.. టీచర్ అని చెప్పడంతో ఆమె కూడా ఫ్రెండ్ షిప్ కు ఒకే చెప్పింది. కొన్ని రోజులు ఇద్దరి మధ్య హాయ్.. గుడ్ మార్నింగ్..? గుడ్ నైట్ లాంటి మెసేజ్ లతో పరిచయం కొనసాగింది. రాను రాను వారి మధ్య స్నేహం బలపడింది. ఆ బంధం కాస్త ప్రేమగా మారింది.. కాదు మార్చేశాడు ఆ మాయగాడు. టీనేజ్ లో యువతికి వచ్చిన ఆకర్షణను ప్రేమంటూ.. మాయమాటల చెప్పి వలలో వేసుకున్నాడు. నిన్నే పెళ్లాడతా అంటూ అమ్మాయిని నమ్మించి పలు మార్లు లైంగికంగా కోరికలు తీర్చుకున్నాడు. ఒకవేళ కోరిక తీర్థకుంటే...చనిపోతానంటూ పలుమార్లు బెదిరించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె కాదనలేకపోయింది.
తనను తాను మంచివాడిగా చెప్పుకున్నాడు. ఒకటికి రెండు సార్లు గొప్ప గొప్ప కబుర్లు చెప్పాడు. కొన్ని నెలల పాటు మైనర్ బాలికతో రిలేషన్ షిప్ కొనసాగించాడు. అయితే కామవాంఛలు తీర్చుకున్న దినేష్ తమ లవ్ గురించి.. వారి మధ్య జరిగిన లైంగిక విషయాల గురించి ఎవరికైనా చెబితే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ భయబ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఆ విషయాన్ని బాలిక గోప్యంగా ఉంచింది. కానీ బాలిక గర్భం దాల్చడంతో ఇంట్లో పెద్దలలు విషయం తెలుసుకున్నారు. వెంటనే అమ్మాయి, ఆమె చిన్నమ్మ హేమలత ఇద్దరు మదనపల్లి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దినేష్ అనే అబ్బాయి పేస్ బుక్ లో పరిచయమై గత కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నానని చెప్పాడని.. తనను ప్రేమించకపోతే చనిపోతాను అంటూ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు అంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. అలాగే అమ్మాయి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి ఆరు,ఏడు సార్లు అమ్మాయికి ఇష్టంలేకపోయినా బలవంతంగా శారీరకంగా అనుభవించాడని ఈ విషయం ఎవరికైనా చెబితే నేను చనిపోతానని భయ పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు దినేష్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై లోకేష్ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇలా పరిచయం లేని వ్యక్తులను ప్రేమించి మోసపోయిన యువతు, బాలికలు ఎందరో ఉన్నారు. అయినా ఇప్పుడు చేతిలో 24 గంటలు ఫోన్ ఉండడంతో వాటికి అడిక్ట్ అయ్యి.. మోపపుతున్నారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.