Home /News /crime /

ONE FAMILY KIDNAP 9 YEARS BOY AFTER FILE A COMPLIANT POLICES ARRESTED KIDNAP GANG AND BOY SAFELY REACHED MOTHER NGS GNT

Crime News: నలుగురూ అమ్మాయిలే.. అబ్బాయి కావాలనుకున్నారు.. చివరికి పోలీసులకు చిక్కారు

నలుగురూ అమ్మాయిలే అబ్బాయి కావాలనుకున్నారు పోలీసులకు చిక్కారు.

నలుగురూ అమ్మాయిలే అబ్బాయి కావాలనుకున్నారు పోలీసులకు చిక్కారు.

crime News: ఓ దంపతులకు తొలి కాన్పులో అమ్మాయి పుట్టింది. కానీ అబ్బాయి కావాలి అనుకున్నారు. దీంతో రెండో కాన్పులోనైనా అబ్బాయి పుడతాడనుకున్నారు. కానీ మళ్లీ అమ్మాయే పుట్టింది. వారికి ఎదురుచూపులే మిగిలాయి.. నలుగురు అమ్మాయిలే పుట్టారు. దీంతో మగపిల్లాడు కావాలని కిడ్నాప్ కు బేరమాడుకున్నారు.. చివరికి పోలీసుల చేతికి చిక్కారు.

ఇంకా చదవండి ...
    Andhra Pradesh Crime news: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో క్రైమ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా (Guntur District)లో హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ లు, దోపీడీల సంఖ్య భయపెడుతోంది. తాజాగా తొమ్మిది నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన ముఠాను గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈపూరు మండలం కొండ బొట్లపాలేనికి చెందిన నాగార్జున(Nagarjuna)కు నలుగురు ఆడపిల్లలు పుట్టారు. నాలుగు సార్లు మగపిల్లాడి కోసం ఎదురు చూసినా అమ్మాయిలే పుట్టారు. మగపిల్లాడు పుట్టకపోవడంతో ఎక్కడైనా బాలుడి ఉంటే తెచ్చి ఇవ్వాలని తన బంధువు పిడుగురాళ్లకు చెందిన తిరుపతి రామాంజనేయులను కోరాడు. ఈ విషయాన్ని రామాంజనేయులు తన బంధువైన గుంటూరుకు చెందిన దేవళ్ల నాగరాజుకు తెలిపాడు. కిడ్నాప్ చేసి బాలుడ్ని అప్పగించేందుకు అతడు 50 వేల రూపాయలు అడిగితే.. 46 వేల రూపాయలకు ఒప్పందం చేసుకొని చెల్లించారు. అప్పటి నుంచి మగపిల్లాడు కనిపిస్తే అపహరించుకెళ్లాలని పథకం రూపొందించారు. రామాంజనేయులు తనకు తెలిసిన గుంటూరుకు చెందిన బాలుడితో కలిసి గత నెల 30న మంగళగిరి మండలం ఆత్మకూరు కాలువ కట్టపై గుడిసె వద్ద ఆడుకుంటున్న 9 నెలల బాలుడు క్రిష్‌కుమార్‌ను చూశారు. ఆ విషయాన్ని రామాంజనేయులు వెంటనే నాగరాజుకు చెప్పి ఆ బాలుడిని కిడ్నాప్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో క్రిష్‌కుమార్‌ తల్లిదండ్రులు తిరుపతమ్మ, పరిమి వద్ద నిద్రిస్తుండగా వచ్చి ద్విచక్రవాహనంపై అపహరించుకెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో డీఎస్పీ రాంబాబు పర్యవేక్షణలో సీఐ భూషణం కేసు దర్యాప్తు చేశారు.

    బాలుడిని కిడ్నాప్‌ చేశాక నిందితులు నాగార్జున అత్త గుంటూరుకు చెందిన ఇరగాదిండ్ల కొండమ్మకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె తాను చుట్టుగుంట వద్దకు వస్తున్నానని, నాగార్జునను అక్కడ రమ్మని చెప్పింది. బాలుడిని తీసుకొని అక్కడకు రాగానే నాగార్జున ఆ బాలుడిని తీసుకొని వెళ్లాడు. ఇంతలో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారనే సమాచారం తెలుసుకొని బాలుడిని పిడుగురాళ్లలోని వారి బంధువుల ఇంటి వద్ద ఉంచారు.

    ఇదీ చదవండి: పెట్రోల్ పోయించుకుంటున్నారా? రావాల్సిన మైలేజ్ రావడం లేదా..? చిప్ లతో చిల్లు పడుతున్నట్టే?

    సమాచారం తెలుసుకున్న సీఐ భూషణం సిబ్బందితో బాలుడిని సంరక్షించారు. నాగరాజు, రామాంజనేయులు, కొండమ్మలను అరెస్టు చేశామని బాలుడిని పునరావాస కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు నాగార్జున పరారీలో ఉన్నాడని, త్వరలో పట్టుకుంటామని చెప్పారు. బాలుడిని ఎస్పీ చేతుల మీదగా తల్లి తిరుపతమ్మకు అందజేయగా ఆమె కృతజ్ఞతలు తెలిపింది. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ గంగాధరం పాల్గొన్నారు.

    ఇదీ చదవండి: ఛీ.. వ్యూస్‌ కోసం ఇంత దారుణమా..? ఓ తండ్రి పనిపై నెటిజన్ల మండిపాటు..? వైరల్ అవుతున్న వీడియో
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur, Kidnap

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు