మణిపూర్ లో (manipur) భారీ పేలుడు సంభవించింది. సోమవారం ఖోంగ్ జోమ్ ప్రాంతంలో ఒక్కసారిగా బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఖోంగ్‌జోమ్‌లోని సపమ్ మాయై లైకైలో సోమవారం కమ్యూనిటీ హాల్‌లో ఐఈడీ పేలుడు సంభవించి ఒకరు మరణించారు. మానవ బాంబుతో (Bomb blast) ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ఘటన స్థలంలో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ ప్రాంతంలో మరేదైన బాంబు పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర కలకలంగా మారింది.
గతంలో ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర దుమారం రేపింది.
ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి కోర్టు ఆవరణలో కాల్పుల ఘటన కలకలం రేపాయి. కోర్టులోని రూమ్ నెంబర్ 207లో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఘటనలో గ్యాంగ్‌స్టార్ జితేంద్ర గోగితోపాటు మరో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు గ్యాంగ్‌ల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టుకు వచ్చిన జితేంద్ర టార్గెట్‌గానే ఈ కాల్పులు జరిగాయని భావిస్తున్నారు. లాయర్ల ముసుగులో ఉన్న జితేంద్ర ప్రత్యర్థులు.. అతడిపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు కూడా వారిపై ఫైరింగ్ చేశారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా తెలిపారు.
ఇది గ్యాంగ్ వార్ అని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. పోలీసులు సకాలంలో స్పందించారని అన్నారు. ఇక ఈ ఘటనలో జితేంద్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 30 ఏళ్ల జితేంద్ర గోగి గత ఏప్రిల్‌లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ ఎంసీవో సీఏ కింద అరెస్టయ్యాడు. హత్యలు, హత్యాయత్నం సహా మొత్తం జితేంద్రపై 19 కేసులు ఉన్నాయి.
ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సత్యనారాయణ్ శర్మ అనే వ్యక్తి జడ్జి ముందు 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగాయని తెలిపారు. కాల్పులకు పాల్పడిన వారిని టిల్లు తాజ్ పూరియా గ్యాంగ్ సభ్యులుగా అనుమానిస్తున్నామని రోహిణి డీసీపీ ప్రణవ్ తయాల్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb blast, Manipur