అందుకే బాంబు పెట్టాం.. కేరళ ఏనుగు హత్య కేసులో ఒకరి అరెస్ట్...

15 సంవత్సరాల ఏనుగు ఇలా దారుణంగా చనిపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.

news18-telugu
Updated: June 5, 2020, 2:49 PM IST
అందుకే బాంబు పెట్టాం.. కేరళ ఏనుగు హత్య కేసులో ఒకరి అరెస్ట్...
కేరళ ఏనుగు మృతి..
  • Share this:
కేరళలో ఏనుగు హత్య కేసులో ఒక నిందితుడిని ప్రత్యేక దర్యాప్తు బృందాలు అరెస్ట్ చేశాయి. మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. కేరళ అటవీ శాఖ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అరెస్ట్ చేసిన వ్యక్తిని పి.విల్సన్‌గా గుర్తించారు. అతడు స్థానికంగా ఓ ఎస్టేట్‌లో పనిచేస్తాడని, ఆ ఎస్టేట్‌లో వంట దినుసులు పండిస్తూ ఉంటారని చెప్పారు. ఈరోజు సాయంత్రానికి ఈ కేసులో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కేరళ అటవీ శాఖ మంత్రి కె. రాజు తెలిపారు. ఎస్టేట్‌లో పంట నాశనం చేసేందుకు వచ్చే ఎలుగుబంట్లను చంపేందుకు తాము ఇలా పండులో నాటు బాంబులు పెట్టి వేటాడతామని చెప్పినట్టు తెలిసింది. అయితే, వారే దానికి బాంబు ఉన్న పైనాపిల్ అందించారా? లేకపోతే పొరపాటున వారు పెట్టిన పైనాపిల్‌ను ఏనుగు తిన్నదా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మరికొందరు నిందితులను కూడా సాయంత్రానికి అరెస్ట్ చేసి వారిని కూడా విచారించిన తర్వాత కేసుపై క్లారిటీ ఇవ్వనున్నారు.

ఓ ఫారెస్ట్ ఆఫీసర్ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయడంతో కేరళలోని పాలక్కాడ్‌లో ఏనుగు మృతి ఘటన వెలుగులోకి వచ్చింది. పండు తిన్న తర్వాత నోటిలో బాంబు పేలడంతో ఏనుగు అల్లాడిపోయింది. వెల్లియార్ నదిలోకి వెళ్లింది. ఏనుగును కాపాడేందుకు అధికారులు కూడా ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకపోయింది. 15 సంవత్సరాల ఏనుగు ఇలా దారుణంగా చనిపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. బాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి కేంద్ర మంత్రుల వరకు తీవ్రంగా స్పందించారు. వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజలు కూడా తీవ్రంగా మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త శ్రీనివాస్ కేరళ ఏనుగును చంపిన వారి వివరాలు తెలిపిన వారికి రూ.2లక్షల నజరానా ప్రకటించారు.

First published: June 5, 2020, 2:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading