ఆవుపై అత్యాచారం.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి అరెస్ట్

ఏదో జరిగిందని.. ఇంటి యజమాని సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీ చూశాడు. అందులో దారుణం కనిపించింది. ఆవుపై అత్యాచారం చేసిన దృశ్యాలు కనిపించాయి.

news18-telugu
Updated: July 8, 2020, 5:12 PM IST
ఆవుపై అత్యాచారం.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మానవత్వానికే మచ్చతెచ్చే ఘటన ఇది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే దారుణమిది. ఆవుపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో సుందర్‌నగర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 4న ఓ పశువుల పాకలోకి చొరబడిన షబ్బీర్ అలీ అనే వ్యక్తి ఆవుపై అత్యాచారం చేశాడు. ఉదయం 4 గంటల ప్రాంతంలో ఆవు రోదనలు విన్న ఇంటి యజమాని బయటకు వెళ్లి చూశాడు. అతడి చూసి నిందితుడు పారిపోయాడు. ఏదో జరిగిందని.. ఇంటి యజమాని సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీ చూశాడు. అందులో దారుణం కనిపించింది. ఆవుపై అత్యాచారం చేసిన దృశ్యాలు కనిపించాయి.


ఘటనపై ఇంటి యజమాని అదే రోజున అశోక్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అశోక్ గార్డెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి శ్రీవాస్తవ తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: July 8, 2020, 5:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading