హోమ్ /వార్తలు /క్రైమ్ /

She Teams: బాధితుల్లో నమ్మకం పెంచేలా.. నిందితుల్లో మార్పు తెచ్చేలా.. ముందుకు సాగుతున్న షీ టీమ్స్

She Teams: బాధితుల్లో నమ్మకం పెంచేలా.. నిందితుల్లో మార్పు తెచ్చేలా.. ముందుకు సాగుతున్న షీ టీమ్స్

మాట్లాడుతున్న స్వాతి లక్రా

మాట్లాడుతున్న స్వాతి లక్రా

మహిళలపై దాడులు అరికట్టడానికి తెలంగాణ షీ టీమ్స్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిందితులకు కౌన్సిలింగ్ ఇస్తూ వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రస్తుత కరోనా సమయంలో ఆన్ లైన్ విధానంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...

దేశంలో మహిళలు, యువతులపై రోజు రోజుకూ దాడులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి దారుణాలను అరికట్టడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో షీ టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. నిందితుల్లో మార్పు తీసుకు వచ్చేందుకు కౌన్సిలింగ్ ను నిర్వహిస్తున్నారు. వారితో పాటు పేరెంట్స్ కు ఈ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తద్వారా వారిలో పరివర్తన తీసుకువచ్చి మరో సారి ఇలాంటి ఘటనకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో నేరుగా కౌన్సిలింగ్ ఇచ్చే అధికారులు ప్రస్తుత కరోనా సమయంలో ఆన్లైన్ విధానంలో వర్చువల్ గా ఇస్తున్నారు.  తాజాగా ఈ రోజు నిర్వహించిన కౌన్సిలింగ్ ను అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతీ లక్రా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలను వేధించిన 143 మందిని గుర్తించి వారిలో మార్పు దిశగా.. మహిళల పట్ల వారి ఆలోచన ధోరణిని మార్చే విధంగా ఈ ప్రయోగాత్మక కౌన్సెలింగ్ కొనసాగింది.

ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ.. మహిళలను వేధింపులకు గురి చేసే వారిలో మార్పు తీసుకురావడానికి కౌన్సిలింగ్ ఓ పద్ధతి అని అన్నారు. అయితే కౌన్సిలింగ్ ఇచ్చినా మారకుండా ఇలాంటి చర్యలకు తిరిగి పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  అనంతరం ఎఫెక్టీవ్ కౌన్సిలింగ్ టెక్నిక్స్ పై ఓ బ్రోచర్ ను ఆమె విడుదల చేశారు. అనంతరం మానోజాగృతి ఎన్జీవోకు చెందిన మానసిక నిపుణులు డాక్టర్. గీతా చల్లా తదితరులు నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేలా అవగాహన కల్పించారు. మహిళల సైకాలజీని వివరించి.. ఈవ్ టీజింగ్ తో కలిగే నష్టాలను వారికి తెలిపారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 4188 ఫిర్యాదులు షీటీమ్స్ కు అందాయి. డయల్ 100, ఫేస్ బుక్, వాట్సాప్, హ్యాక్ ఐ, ఈ మెయిల్, ట్విట్టర్ ద్వారా ఈ ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 69 శాతం ఫిర్యాదులు ఫోన్, సోషల్ మీడియాలో వేధింపులకు సంబంధించనవే ఉండడం గమనార్హం. ఈవ్ టీజింగ్ కేసులు మరో 24 శాతం ఉన్నాయి. ‘Model online counselling session’ కార్యక్రమాన్ని తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా రూపొందించారు. రాష్ట్రంలోని మానసిక నిపుణులు పాల్గొనే ఈ కార్యక్రమంలో నిందితుల ప్రవర్తన మార్చేలా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. దీంతో పాటు బాధితుల్లో తాము భద్రంగా ఉన్నామనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు.

First published:

Tags: She teams, Telangana Police

ఉత్తమ కథలు