హోమ్ /వార్తలు /క్రైమ్ /

మహిళను చెప్పుతో కొట్టి ఈడ్చీ పాడేసిన రాజ్ థాకరే కార్యకర్తలు.. షాకింగ్ క్లిప్స్ వైరల్..

మహిళను చెప్పుతో కొట్టి ఈడ్చీ పాడేసిన రాజ్ థాకరే కార్యకర్తలు.. షాకింగ్ క్లిప్స్ వైరల్..

బాధిత మహిళ

బాధిత మహిళ

Mumbai:  మహిళను మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఇష్టమోచ్చినట్లు కొట్టారు. రోడ్డు మీద నానా రచ్చ చేశారు. వదిలేయాలని ప్రాధేయ పడిన అసలు జాలీచూపలేదు. 

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

కొందరు మహిళల పట్ల ఇప్పటికి అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. నోటికొచ్చినట్లు తిడుతూ.. భౌతికంగా దాడులు చేయడానికి సైతం వెనుకాడరు. మరికొన్ని చోట్ల మహిళలను లైంగికంగా వేధింపులకు కూడా గురిచేస్తుంటారు. మహిళల పట్ల గౌరవ మర్యాదలు మాత్రం అసలు చూపించరు. అంతేకాకుండా సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ముంబైలోని (Mumbai)  ముంబాదేవీ ప్రాంతంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు రెచ్చిపోయారు. అక్కడ ఒక మహిళను పట్టుకుని నోటికొచ్చినట్లు దుర్భాషాలాడారు. అంతే కాకుండా.. ఆమెను నెట్టి వేస్తు, భౌతిక దాడులకు పాల్పడ్డారు. అయితే.. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు సదరు మహిళ మెడికల్ దుకాణం ముందు వెదురుతో తయారు చేసిన స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.


అయితే.. దాన్ని ఆమె దానికి అభ్యంతరం తెలిపింది. దీంతో రెచ్చిపోయిన వారు ఈ దురాగతానికి పాల్పడ్డారు. కాగా, ప్రకాష్ దేవి అనే మహిళ ఆగస్ట్ 28న వినోద్ అర్గిలే నేతృత్వంలోని MNS మెన్ ప్రచార బోర్డుల కోసం స్తంభాన్ని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో వారు ఇష్టమోచ్చినట్లు దాడులు చేశారు. ఈ ఘటన వైరల్ కావడంతో ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఇప్పటి వరకు దీనిపై పార్టీ ఏ మాత్రం స్పందించలేదు. పోలీసులు కూడా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. దీని క్లిప్పింగ్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా పిల్లలే.. తండ్రి చేసుకుంటున్న మరో పెళ్లిని పెటాకులు చేశారు.
ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh) సీతాపూర్ ప్రాంతంలో వింత ఘటన చోటు చేసుకుంది. దీన్ని చూసి అధికారులు, స్థానికులు తలలు పట్టుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. సీతాపూర్ కు చెందిన రాజకు ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు (Wedding)  అయ్యాయి. అతనికి ఏడుగురు పిల్లలు కూడా పుట్టారు. మనోడు అంతటితో ఆగకుండా.. మరోక పెళ్లికి రెడీ అయిపోయాడు. ఇది కాస్త మొదటి, రెండో భార్యల పిల్లలకు తెలిసింది. వారు పెళ్లి జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ తండ్రి నిర్వాకాన్ని గురించి తెలిపారు.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర గందర గోళం నెలకొంది. ఇప్పటికే మొదటి భార్య నుంచి విడాకులు పొందాడు. కానీ ఖర్చులు మాత్రం ఇవ్వలేదు. ఇక రెండో భార్యకు కూడా వదిలించుకొవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో తన పెళ్లిళ్లు దాచిపెట్టి, మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. అక్కడ తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తడంతో, కొత్త పెళ్లి కూతురు అక్కడి నుంచి మాయమైంది. దీంతో పోలీసులు రాజును స్టేషన్ కు తరలించారు. విచారణ చేపట్టారు.ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియలో (Social media)  వైరల్ గా (Viral news) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Maharashtra, VIRAL NEWS

ఉత్తమ కథలు