హోమ్ /వార్తలు /క్రైమ్ /

Pakistan: దారుణం.. సూసైడ్ బాంబార్ గా మారిన మహిళ.. నలుగురు మృతి.. టార్గెట్ వాళ్లే..

Pakistan: దారుణం.. సూసైడ్ బాంబార్ గా మారిన మహిళ.. నలుగురు మృతి.. టార్గెట్ వాళ్లే..

బాంబర్ గా మారిన మహిళ

బాంబర్ గా మారిన మహిళ

Karachi: పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ.. కరాచీలోని చైనీయులు ప్రయాణిస్తున్న వాహానం దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత.. తనను తాను పేల్చేసుకుంది.

Suicide Bomber Blows Herself Up In Karachi: పాక్ లో మంగళవారం దారుణం జరిగింది. కరాచీలో (Karachi) ఒక మహిళ తనకు తాను పేల్చేసుకుని ఆత్మాహుతి బాంబర్ గా మారింది. కరాచీ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనంపై పాకిస్థాన్ వేర్పాటువాద గ్రూపుకు చెందిన మహిళా ఆత్మాహుతి (Woman Suicide Bomber Blows Herself) బాంబర్ దాడిలో ముగ్గురు చైనా జాతీయులతో సహా నలుగురిని హతమార్చింది. ఈ ఘటనపై చైనా సీరియస్ అయ్యింది. ఈ దారుణానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహిస్తుందని తెలిపింది.

అయితే, తొలిసారి ఒక మహిళ ఈ విధంగా ఆత్మహుతి చేసుకొవడం ప్రస్తుతం కలవరపెడుతుంది. ఈ మిషన్‌ను తొలిసారిగా మహిళా మిలిటెంట్‌గా నిర్వహించారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు చైనా పౌరులు సహా నలుగురు మరణించినట్లు (3 Chinese Killed) కరాచీ పోలీసులు ధృవీకరించారు. బలోచీస్తాన్ ప్రావిన్స్‌లో వేర్పాటువాదులచే చైనా లక్ష్యాలు క్రమం తప్పకుండా దాడి చేయబడుతున్నాయి.

ఇక్కడ బీజింగ్ తన బెల్ట్, రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పాల్గొంటుంది. ఇక్కడి ప్రాంతంలో లాభదాయకమైన మైనింగ్, ఇంధన ప్రాజెక్టులపై వేర్పాటువాదులు చాలా కాలంగా ఆగ్రహాన్ని కలిగి ఉన్నారు. అదే విధంగా స్థానికులు ప్రయోజనాలను కాలరాస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటన పాక్ లో కలకలంగా మారింది. అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.

ఆఫ్రికా దేశం నైజీరియాలో ఘోర ప్రమాదం (Nigeria Explosion) జరిగింది.

చమురు శుద్ధి కార్మాగారంలో (Oil Refinery Blast) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో వంద మందికి పైగా మరణించారు. ఎంత మంది మరణించారన్న దానిపై స్పష్టత లేదని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. భారీగా ప్రాణ నష్టం జరిగిందని.. మృతదేహాలు గుర్తు పట్టలేనంతంగా కాలిపోయాయని వెల్లడించాయి. రివర్స్, ఇమో స్టేట్ మధ్య శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సిబ్బంది అంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడికక్కడే చాలా మంది మరణించారు. కొందరు ప్రాణ భయంలో బయటకు పరుగులు చేశారు. చెట్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. చెట్ల కొమ్మలకు శవాలు వేలాడుతూ కనించాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయ విదారకరంగా ఉన్నాయని వెల్లడించాయి. పలువురు మంటల్లో కాలిపోయి బూడిదయ్యారని.. అందువల్ల ఎంత మంది మరణించారన్న దానిపై ఖచ్చితమైన లెక్కలు లేవు. నైజీరియాలో ఈ తరహా అక్రమ చమురు శుద్ధి కర్మాగారాలు చాలానే ఉన్నాయి. పైప్‌లైన్స్‌ని ధ్వంసం చేసి ముడి చమురు దొంగిలించి.. అక్రమ రిఫైనరీల్లో శుద్ధి చేస్తుంటారు. అనంతరం బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. అక్రమ చమురు శుద్ధి కర్మాగారాల్లో సరైన భద్రత ఉండదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. అందువల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అంతేకాదు పైప్ లైన్స్ నుంచి మంటలు చెలరేగిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. మెయింటెన్స్ లేకపోవడం, దొంగతనాలు జరగడం వల్ల అక్కడ తరచూ ఇలాంటి పేలుళ్లు జరుగుతాయి.

First published:

Tags: Bomb attack, China, Crime news, Pakistan, Woman suicide

ఉత్తమ కథలు