కొన్ని చోట్ల దొంగలు పోలీసులను, జనాలను ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఒకప్పుడు అర్ధరాత్రి చోరీలు చేస్తుండేవారు. కానీ ఇప్పుడు దొంగలు తమ ట్రెండ్ మార్చుకున్నారు. గన్ లు పట్టుకుని ఎప్పుడు పడితే అప్పుడు చోరీలు చేస్తున్నారు. టార్గెట్ ను చూజ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత.. గుంపులుగా వెళ్లి వెళ్లిన పని కానిచ్చేస్తున్నారు. మెయిన్ గా బంగారం, బ్యాంక్ లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, చోరీకి సంబంధించిన మరో వీడియో నెట్టింట (Social media) వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. బీహర్ లోని (Bihar) అమానుష ఘటన జరిగింది. హజీపూర్ లో జూన్ 22న జరిగిన చోరీ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన రాత్రి 8 గంటల ప్రాంతంలో.. సుభాష్, మదాయి చౌక్ వద్ద జరిగింది. నీలం జ్యువెలరీలో (Gold shop robbery) ఈ ఘటన జరిగింది. సునీల్ ప్రియదర్శి కు చెందిన బంగారు దుకాణంలో ఇది జరిగింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో కొంత మంది మాస్క్ లు ధరించి షాపులో ప్రవేశించారు. అప్పటికే షాపులో కొంత మంది కస్టమర్ లు కూడా ఉన్నారు. వెంటనే వారు గన్ తీసి అందరికి బెదిరించారు.
డబ్బులు , బంగారం ఇచ్చేయాలని బెదిరించారు. అయితే, షాపు ఓనర్ సునీల్ ప్రతిఘటించడానికి ప్రయత్నించారు. అతడిని దోంగలు కాలితో తన్నుతూ.. కొడుతూ అమానుషంగా ప్రవర్తించారు. ఆ తర్వాత.. అతడిని కాల్చి చంపేశారు. ఆ తర్వాత.. దొంగతనం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, షాపులో ఉన్న సీసీ కెమెరాలో దొంగతనానికి చెందిన ఘటన రికార్డు అయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుము కున్నాయి.
ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్(Madhya pradesh)లోని ఇండోర్లో ఓ భర్త చేసిన పని తెలిసి భార్య ఆశ్చర్యపోయింది.
ఛోటా బంగార్డా ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం బబిత అనే మహిళతో వివాహమైంది. 15 రోజుల క్రితం తండ్రి కూడా అయ్యాడు. అయితే భార్యను ప్రసవం కోసం ఆమె పుట్టింటికి పంపించిన భర్త తర్వాత ఖజ్రానా ప్రాంతానికి చెందిన మరో అమ్మాయితో కలిసి పారిపోయాడు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్యకు ఫేస్బుక్ ద్వారా తెలిసింది. దీంతో భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బబిత. భర్త చాలా కాలంగా ముస్లిం అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య బబిత ఆరోపిస్తోంది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. భర్త మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని భార్య చెప్పింది. అంతే కాదు భర్త ఫోన్లో కూడా తనను బెదిరించాడని తెలిపింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.